ఇల్లైనా గానీ, ఫ్లాట్ అయినా గానీ 1 బీహెచ్‌కే కొనుక్కోవడం మంచిదా? 2 బీహెచ్‌కే కొనుక్కోవడం మంచిదా? మధ్యతరగతి వారికి ఈ రెండిటిలో ఏది మంచిది?
ఫ్లాట్ లేదా ఇల్లు కొనడం అనే దాన్ని సాధారణ విషయంగా చూడకూడదు. దాన్నొక పెట్టుబడిగా చూడాలి. దాదాపు చాలా మంది పెట్టుబడి అంశంగానే పరిగణిస్తారు. ప్రాపర్టీ మీద పెట్టుబడి పెట్టడం అనేది మంచి నిర్ణయమే. అయితే ప్రాంతం, బడ్జెట్, ఫ్యామిలీ సైజ్ వంటి అంశాలు పక్కన పెడితే.. అసలు 1 బీహెచ్‌కే ఫ్లాట్ కొనుక్కోవాలా? 2 బీహెచ్‌కే ఫ్లాట్ కొనుక్కోవాలా? అనేది చాలా మంది నిర్ణయించుకోలేకపోతారు. బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు 1 బీహెచ్‌కే మీద పెట్టుబడి పెట్టాలా? లేక 2 బీహెచ్‌కే మీద పెట్టుబడి పెట్టాలా? అనే విషయంలో గందరగోళానికి గురవుతారు. రియల్టర్లు పలు ప్రయోజనాలతో కూడిన ఆఫర్లను ఇస్తున్నప్పుడు, ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు గృహ రుణాలు ఇస్తున్నప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే 1 బీహెచ్‌కే లేదా 2 బీహెచ్‌కే.. ఈ రెండిటిలో ఏది కొనడం ఉత్తమం. మీరు ఉండడానికైనా, భవిష్యత్తులో పెట్టిన పెట్టుబడికి లాభం రావాలన్నా ఈ రెండిట్లో ఏది ఉత్తమం అనేది ఇప్పుడు చూద్దాం.
కుటుంబంలో ఇద్దరు మాత్రమే ఉంటే గనుక 1 బీహెచ్‌కే అనేది మంచి పెట్టుబడి విధానం. కానీ ఫ్యామిలీ సైజ్ పెరుగుతుంది అనుకుంటే గనుక అంటే పిల్లలు పుట్టడం, పెరగడం.. ఇలాంటి సందర్భంలో 2 బీహెచ్‌కే కొనుక్కోవడం మంచిది. తల్లిదండ్రులు మీతో పాటు ఉంటే గనుక 2 బీహెచ్‌కే ఫ్లాట్ లేదా ఇల్లు తీసుకోవడం మంచిది. 2 బీహెచ్‌కే ఫ్లాట్ లేదా ఇంటి మీద పెట్టుబడి పెట్టడం అనేది మంచి నిర్ణయం. ఎందుకంటే భవిష్యత్తులో మీరు అమ్మేయాలి అనుకున్నా గానీ 2 బీహెచ్‌కే త్వరగా రీసేల్ అవుతుంది. అదే 1 బీహెచ్‌కే ఐతే అంత త్వరగా రీసేల్ ఎవ్వడు. ఎందుకంటే ఎక్కువ మంది 2 బీహెచ్‌కే ఫ్లాట్లు, ఇళ్లనే కొంటున్నారు. ఉత్తమ సౌకర్యాలు, ఫ్లాట్ సైజ్ వంటి పలు ఆప్షన్స్ కారణంగా ఎక్కువగా 2 బీహెచ్‌కేల మీదే మక్కువ చూపిస్తున్నారు.
చాలా మంది 2 బీహెచ్‌కేతో పోలిస్తే 1 బీహెచ్‌కే చాలా తక్కువ అని ఆలోచిస్తారు. కానీ చదరపు అడుగుల్లో ధరలు పోల్చి చూసినప్పుడు కొన్నిసార్లు 2 బీహెచ్‌కే కంటే ఎక్కువ ధర 1 బీహెచ్‌కేకే అవుతుంది. కాబట్టి చదరపు అడుగుకి అధిక ధర చెల్లించి 1 బీహెచ్‌కే మీద పెట్టుబడి పెట్టే కంటే చిన్న 2 బీహెచ్‌కేఫ్లాట్ మీద పెట్టుబడి పెట్టడం తెలివైన వారి లక్షణం. ఎందుకంటే ఎక్కువ మంది 2 బీహెచ్‌కే ఫ్లాట్లే కొంటున్నారు. 1 బీహెచ్‌కే ఫ్లాట్స్ కి డిమాండ్ అనేది తక్కువ. ఇప్పుడు చాలా మంది కొంచెం లగ్జరీగా, విశాలంగా ఉండాలని కోరుకుంటున్నారు. భవిష్యత్తులో పిల్లలు పుట్టినా కూడా వారికంటూ ఒక సెపరేట్ బెడ్ రూమ్ ఉంటుందని ఆలోచిస్తున్నారు. కాబట్టి 2 బీహెచ్‌కే అనేది చాలా మంచి ఛాయిస్. గెస్ట్ రూమ్, స్టడీ రూమ్, స్టోర్ రూమ్ కోసం ఎక్స్ ట్రా స్పేస్ అనేది వస్తుంది.
ఇప్పుడు భార్య, భర్తలే అనుకున్నా భవిష్యత్తులో పిల్లలు పుట్టినా వారికి కూడా ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది. కాస్త విశాలంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి.. అది రెంట్ల రూపంలో కావచ్చు, రీసేల్ రూపంలో కావచ్చు భవిష్యత్తులో లాభాలు రావాలి అంటే గనుక 2 బీహెచ్‌కే అనేది ఉత్తమ ఛాయిస్. ప్రస్తుతం ఎక్కువ మంది 2 బీహెచ్‌కే ఫ్లాట్లే కడుతున్నారు. నగరంలోని కొన్ని ప్రధాన ఏరియాల్లో 1 బీహెచ్‌కే ఫ్లాట్ దొరకడం అనేది గగనం అయిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, 1 బీహెచ్‌కే విలువ. పెట్టిన పెట్టుబడికి న్యాయం జరగాలంటే 2 బీహెచ్‌కేనే. కానీ మిడిల్ క్లాస్ వారికి 2 బీహెచ్‌కే మీద పెట్టుబడి పెట్టడం అంటే కొంచెం కష్టమైన విషయమే. 1 బీహెచ్‌కే అయితే తక్కువ ఉంటుంది, తక్కువ ఈఎంఐ ఉంటుంది. సింపుల్ గా అయిపోతుంది అని అనిపిస్తుంది. కానీ 2 బీహెచ్‌కేకి ఉన్న విలువ, డిమాండ్ 1 బీహెచ్‌కేకి లేవు. కాబట్టి రీసేల్ అప్పుడు, రెంటల్స్ విషయంలో బాధపడాల్సి వస్తుంది. కొంచెం కష్టమైనా గానీ 2 బీహెచ్‌కే మీద పెట్టుబడి పెడితే బాగుంటుందనేది నిపుణుల అభిప్రాయం. మరి 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే.. ఈ రెండిటిలో మీ ఛాయిస్ ఏంటో కామెంట్ చేయండి.