బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్ లో వారియర్స్ vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ కనిపించడం లేదు. అందరూ కలిసిపోయి గ్రూపులుగా ఆడుతున్నారు. అయితే రెగ్యులర్ బిగ్ బాస్ కు భిన్నంగా ఓటీటీలో ప్రతిరోజూ ఏదొక టాస్కు పెడుతున్నారు. ఈసారి మార్నింగ్ ఫన్ యాక్టివిటీలో భాగంగా ఓ కామెడీ స్కిట్ చేయాలని కోరారు. కంటెస్టెంట్లు ఒక కుటుంబంగా మారి కామెడీ చేయాలని సూచించారు. అందులో కుటుంబ పెద్ద నటరాజ్ మాస్టర్, అతని భార్య ముమైత్ ఖాన్. ఇంక యాంకర్ శివ తాగుబోతు.. అతని భార్యగా అషురెడ్డి నటించారు.
ఇదీ చదవండి: తన బ్రేకప్ లవ్ స్టోరీపై బిందు మాధవి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇంకేముంది.. అసలే కోతి ఆపై కల్లు తాగితే అన్న చందాన తయారైంది యాంకర్ శివ పరిస్థితి. ఇంట్లో అందరినీ ముప్పు తిప్పలు పెట్టాడు. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ ను అయితే లుంగీ గుంజుతూ నానా యాగి చేశాడు. ముమైత్ ఖాన్ ని కూడా వదలలేదు. స్కిట్ స్టార్ట్ అయిన కాసేపటికి ముమైత్ దగ్గరకు వెళ్లి నటరాజ్ మాస్టర్ ఏం చేశాడని అడగగా.. ఆమె డబుల్ మీనింగ్ లో డాంగ్ డాంగ్ అంటూ నవ్వుతుంది. అలా ఆ స్కిట్ ను ఏ సర్టిఫికెట్ స్థాయికి తీసుకెళ్లారు. ఇంక యాంకర్ శివ లుంగీ ఊడదీయడం, దాన్ని భుజాన వేసుకుని తిరగడం, నటరాజ్ మాస్టర్ లుంగీలోకి దూరడం చేశాడు.
స్కిట్ లో ఇన్వాల్వ్ అయిన నటరాజ్ మాస్టర్ యాంకర్ శివపై కోపంతో ఊగిపోయాడు. ఎక్కడ దొరికాడు వీడు అంటూ కేకలు వేశాడు. బురదలో పంది బతుకుతోంది నువ్వు బతుకుతున్నావ్ అంటూ శివపై చిందులు తొక్కాడు. అతని అల్లరి భరించలేక అతనికి మజ్జగ ఇవ్వండంటూ కోరాడు. ఇంక నటరాజ్ మాస్టర్ నే కాదు అటు అషురెడ్డిని కూడా శివ ఓ ఆట ఆడుకున్నాడు. అషురెడ్డిని పట్టుకోవడం, ఆమెను హగ్ చేసుకోవడం చేశాడు. ఆ తర్వాత బెంచ్ మీద ఆమె ఒళ్లో పడుకున్నాడు. ఆ సమయానికి టాస్క్ అయిపోయిందని చెప్పడంతో అషు కోపంగా టాస్క్ అయిపోయిందిలే ఇంక లే అంటూ విసుక్కుని వెళ్లిపోయింది. మొత్తానికి ఈ టాస్క్ ప్రేక్షకులు నవ్వుకోవడానికి ఇచ్చినట్లు లేదు.. యాంకర్ శివ నటరాజ్ మాస్టర్, అషుని ర్యాగింగ్ చేయడానికి ఇచ్చనట్లుగా మారింది చివరికి. ఈ స్కిట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.