బిగ్ బాస్ 5వ సీజన్ ముగిసినప్పటి నుండి బిగ్ బాస్ OTT ఫస్ట్ సీజన్ హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతున్న ఈ బిగ్ బాస్ తెలుగు OTT సీజన్ లో పాల్గొనబోయే సెలబ్రిటీలు వీరేనంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. తాజాగా బిగ్ బాస్ ఓటిటి సీజన్ లో పాల్గొనబోయే లిస్టులో యాంకర్ శ్రీముఖి కూడా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
శ్రీముఖి ఇదివరకు బిగ్ బాస్ 3వ సీజన్ లో పాల్గొని రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఇటీవల కామెడీ స్టార్స్ షో నుండి యాంకర్ గా వర్షిణి తప్పుకున్న తర్వాత శ్రీముఖి ఎంటర్ అయింది. కొద్దిరోజుల కిందటే కామెడీ స్టార్స్ సీజన్ ముగిసింది. ఇక సెకండ్ సీజన్ ‘కామెడీ స్టార్స్ ధమాకా’కి యాంకర్ గా దీపికా పిల్లి వ్యవరిస్తోంది. శ్రీముఖి చివరిగా సంక్రాంతి స్పెషల్ షోలో కనిపించింది.
తాజాగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్న ‘సూపర్ క్వీన్’ రియాల్టీ షోలోకి శ్రీముఖి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిందని సమాచారం. లేటెస్ట్ గా విడుదలైన ఈ షో టీజర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 5 ముగియగానే బిగ్ బాస్ తెలుగు OTTని ప్రకటించాడు అక్కినేని నాగార్జున. ఓటిటి వెర్షన్ ఫస్ట్ సీజన్ కి ఆయనే హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. మరి శ్రీముఖి బిగ్ బాస్ ఓటిటిలో ఎంట్రీ ఇస్తుందా లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.