ఈ మధ్యకాలంలో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ షో.. త్వరలో ఓటిటి వెర్షన్ ‘బిగ్ బాస్ తెలుగు OTT’ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ ఓటిటి వెర్షన్ కి సంబంధించి కంటెస్టెంట్ల సెలక్షన్ జరుగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు ఓటిటి ఫస్ట్ సీజన్ లో పాల్గొనబోయేది వీరే అంటూ పలువురి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓటిటి లిస్టులోకి మరో పేరు చేరినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ 4వ సీజన్ లో మంచి ప్రదర్శన కనబరిచి పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ అరియానా గ్లోరీ.. బిగ్ బాస్ ఓటిటిలో మరోసారి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ లను ముగ్గురిని ఈ ఓటిటి వెర్షన్ లోకి తీసుకురానున్నారని.. ఆ ముగ్గురి పేర్లలో అరియానా పేరు కూడా ఉందని పలు కథనాలు చెబుతున్నాయి.
మరి అరియానా ఎంట్రీ నిజమో కాదో క్లారిటీ రాలేదు. కానీ అరియానా తళుకులను మరోసారి చూడబోతున్నామా.. అంటూ ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 15 మంది కంటెస్టెంట్లతో 82 రోజుల పాటు ప్రసారం కానున్న ఈ ఓటిటి వెర్షన్ కంటెస్టెంట్స్ ఎంపిక చివరి దశకు చేరుకుందట. మరోవైపు అరియానాకి బిగ్ బాస్ నుండి కాల్ వెళ్లిందని.. ఆమె కూడా ఈసారి ట్రోఫీ కొట్టేందుకు సిద్ధం అవుతోందని అంటున్నారు. మరి డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న ‘బిగ్ బాస్ తెలుగు ఓటిటి’ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.