బిగ్ బాస్ ఓటిటి హౌస్ లో అప్పుడే కెప్టెన్సీ రోల్ కోసం టాస్కులు మొదలయ్యాయి. ఈ టాస్క్ పేరు స్టిక్కర్ ఎటాక్. దీనిలో గెలిచిన టీమ్ నుండి ఇద్దరు కెప్టెన్సీ చేసేందుకు అర్హులుగా ఎంపిక అవుతారు. ఇన్ టైంలో స్టిక్కర్స్ అంటించి సైరెన్ మోగగానే ఆపేయాలి. దీనిలో ప్రతి రౌండ్ కి ముగ్గురు ముగ్గురు చొప్పున పార్టిసిపేట్ చేస్తారు. అన్ని రౌండ్స్ ముగిసేసరికి కౌంటింగ్ లో ఎక్కువ స్టిక్కర్స్ ఎవరు అంటిస్తారో వారే విజేతలని బిగ్ బాస్ చెప్పారు.
ఇందులో వారియర్స్ టీమ్ కి ముమైత్ ఖాన్ సంచాలక్ గా, ఛాలెంజర్స్ టీమ్ కి యాంకర్ శివ సంచాలక్ గా ఉన్నాడు. ఫస్ట్ రౌండ్ లో ఛాలెంజర్స్, నెక్ట్స్ రౌండ్ లో వారియర్స్ గెలిచారు. ఈ క్రమంలో యాంకర్ శివ.. నటరాజ్ మాస్టర్ ని గెలికాడు. వెంటనే మాస్టర్, యాంకర్ శివ పై ‘అలా మాటలు విసరడం నాకు నచ్చలేదని, ఫిజికల్ గేమ్ పెట్టండి బిగ్ బాస్ మేము రెడీగా ఉన్నాం’ అంటూ అరిచాడు.
ఇక మూడో రౌండ్ లో ‘మాస్టర్ మీరు చేత్తో దించితే బాగోదు చెప్తున్నా..’ అంటూ ఆపేశాడు శివ. కోపంతో మాస్టర్ ‘చాలా.. ఏం చేస్తావ్ చెప్పూ.. ఏం పీకుతావ్. నువ్వు తోలుతీస్తా.. నా బొంగు కూడా పీకలేవ్’ అంటూ రెచ్చిపోయి శివపై ఎగబడ్డారు. ఇద్దరి మధ్య వాగ్వాదం గట్టిగానే జరిగింది. ఇక్కడ సంచాలక్ అనేది మర్చిపోయి శివ బిహేవ్ చేశాడు. నటరాజ్ మాస్టర్ కూడా తనదైన శైలిలో శివ పై ఫైర్ అయ్యాడు. ఫైనల్ గా టాస్క్ గెలిచి వారియర్స్ టీమ్ నుండి నటరాజ్ మాస్టర్, సరయు కెప్టెన్సీ పోటీకి ఎంపికయ్యారు. మరి శివ – మాస్టర్ ల వాదనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.