బిగ్ బాస్ తెలుగు ఓటీటీకి ఊహించినంత స్పదన లభించలేదు. మొదట్లో బాగానే ఆదరణ లభించినా ఆ తర్వాత ప్రేక్షకులకు ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. నాన్ స్టాప్ స్ట్రీమింగ్ చేస్తున్నా కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే అందుకు ముందు జరిగిన దానిని తర్వాత రోజు లైవ్ స్ట్రీమ్ చేయడం కారణంగా చెబుతున్నారు. అయితే బిగ్ బాస్ ఓటీటీలో 11వ వారానికి చేరుకుంది. ఇంకా హౌస్ లో 8 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. వారిలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది. అలా చేసినా కూడా ఇంకా హౌస్ లో ఆరుగురు ఉంటారు. అలా అయితే టాప్ 5 కోసం ఇంకొకరిని ఇంటికి పంపిస్తారా? లేక టాప్ 6 అని కొత్త కాన్సెప్ట్ ఏమైనా ప్లాన్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
అయితే ఈ వారం మాత్రం ఎలిమినేట్ అయ్యే వారిలో ఒకరి పేరును మన లీకుల వీరులు బయటపెట్టారు. ఈ వారం బిగ్ బాస్ నాన్ స్టాప్ నుంచి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కానున్నట్లు చెబుతున్నారు. ఓ వెబ్ సైట్ నిర్వహించిన అధికారిక పోల్ లోనూ అదే ఫలితం వచ్చింది. నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కానున్నట్లు 56 శాతం మంది ప్రేక్షకులు ఓట్లు వేశారు. టాప్ ప్లేస్ ల విషయానికి వస్తే అఖిల్, బిందు, యాంకర్ శివ స్ట్రాంగ్ గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాబా భాస్కర్ సైతం గట్టిపోటీ ఇస్తున్నాడు. ఎంటర్ టైన్మెంట్ ఓరియంటెడ్ గా బాబాని హౌస్ లోకి పంపితే.. ఇప్పుడు మెయిన్ ప్లేయర్లకే ఎసరు పెడుతున్నాడు. నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కావడానికిఎప్పటిలాగానే ఆయన మాటలు, చేతలు కూడా కారణం అని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: సీక్రెట్ స్మోకింగ్ పై అషు బోల్డ్ కామెంట్స్.. నేను నోరు తెరిస్తే అతనికి నష్టం!గేమ్ లో అంత స్ట్రాంగ్ గా ఉండే నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవుతాడని ఎందుకు అనుకుంటున్నారో చూద్దాం. హౌస్ లో అందరికీ వండి పెట్టండం, ఫిజికల్ టాస్క్ వస్తే వందకు వంద శాతం ఇవ్వడమే నటరాజ్ మాస్టర్ కి తెలిసింది. కానీ, ఆయనపై ప్రేక్షకులు ఎందుకు అంత కోపంగా ఉన్నారంటే.. మొదటి నుంచి నటరాజ్ ప్రవర్తనపై ఇంట్లోని సభ్యుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. నామినేషన్స్ లో ఆయన పేరు చెబితే తట్టుకోలేడు. నామినేట్ చేసిన వారిపై కోపంతో కేకలు వేస్తాడు, పిచ్చిగా ప్రవర్తిస్తాడు. నన్నెందుకు నామినేట్ చేశావంటూ గోల చేస్తాడు. అది మొదటి నుంచి వస్తున్న ఆరోపణ.
ఆ తర్వాత కెమెరాలతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంట్లో ఉన్న సభ్యులతో కాకుండా ఎక్కువగా కెమెరాలతో మాట్లాడుతూ ఉంటాడు. తన కుమార్తె టాపిక్ తీసుకురావడం కూడా నటరాజ్ మాస్టర్ కు మైనస్ గా మారింది అనే చెప్పాలి. హౌస్ లో ఎక్కువసార్లు నిద్రపోయింది ఎవరూ అంటే నటరాజ్ పేరే చెబుతారు. బిగ్ బాస్ చూసిన తర్వాత నేను కాదంటూ కెప్టెన్ తో గొడవకు దిగుతాడు. ఇటీవల దేవుడితో మాట్లాడుతున్నా అంటూ హౌస్ లో నానా హంగామా చేశాడు. అవన్నీ నటరాజ్ మాస్టర్ కు చాలా మైనస్ మార్కులు తెచ్చిపెట్టాయి. చూస్తున్న ప్రేక్షకులు సైతం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసే విధంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: బిగ్ బాస్ హిస్టరీలో టైటిల్ కొట్టిన తొలి లేడీగా బిందు మాధవి రికార్డు సృష్టించనుందా!ఇంక టాప్ కంటెస్టంట్ గా ఉన్న అఖిల్ తో గొడవకు దిగడం కూడా నటరాజ్ మాస్టర్ నెగెటివిటీ మూట కట్టిందనే చెప్పాలి. అఖిల్ తనకు సపోర్ట్ చేయకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన నటరాజ్ మాస్టర్ గొడవకు దిగాడు. నువ్వు నాకు సపోర్ట్ చేయలేదంటూ అఖిల్ పై కేకలు వేశాడు. అలా చేయడం వల్ల సోషల్ మీడియాలో నటరాజ్ మాస్టర్ పై నెగటివిటీ పెరిగిపోయింది. ఇలా అధికారిక, అనధికారిక ఫ్యాన్ పోల్స్ లో అఖిల్ అభిమానులు నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవుతాడంటూ ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. నిజానికి నటరాజ్ మాస్టర్ లాంటి స్ట్రైట్ ఫార్వాడ్ వ్యక్తి బిగ్ బాస్ లాంటి గేమ్ షోలకు పనికిరారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయనకు మైండ్ గేమ్స్ తెలియవని, మనసులో ఉన్నది పైకి అనేయడం, కష్టపడి గేమ్ ఆడటం మాత్రమే తెలుసునని నటరాజ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. నటరాజ్ మాస్టర్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.