బిగ్ బాస్ తెలుగు ఓటీటీ.. చివరి వారానికి చేరుకుంది. ఇంకా ఒక వారం మాత్రమే మిగిలుంది. 11 వారాలు హౌస్ లో ఉండి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం నటరాజ్ ఎలిమినేట్ కానున్నట్లు ముందే లీకులు వచ్చిన సంగతి తెలిసిందే. నటరాజ్ మాస్టర్ ఇంట్లో ఉన్నన్ని రోజులు అందరికీ వంట చేయడం, టాస్కుల్లో వందశాతం పెట్టి పోరాడటం చూశాం. అయితే టాప్ 5లోకి వస్తాడు అనుకునే సమయంలో స్యంకృతాపరాధంతో 11వ వారం ఎలిమినేట్ కావడం చూశాం. లాస్ట్ లో దేవుడితో మాట్లాడుతున్నా అంటూ బిహేవ్ చేయడం, అఖిల్ తో గొడవ ఇవన్నీ కలిపి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యేలా చేసినట్లు తెలుస్తోంది.
అయితే హౌస్ లో ఉన్నా.. బయటకు వచ్చినా కూడా నటరాజ్ మాస్టర్ లో ఫైర్ మాత్రం తగ్గలేదు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూనే.. హౌస్ లో ఉండే కొందరిపై నిప్పులు చెరిగాడు. సాధారణంగా నటరాజ్ మాస్టర్ మనసులో ఉన్నది బయటకు చెప్పేస్తాడు.. లోపల ఏదీ పెట్టుకోడు అని అందరికీ తెలిసిందే. ఎలిమినేషన్ తర్వాత కూడా అదే నిరూపించాడు. హౌస్ లో ఎన్నో రాజకీయాలు ఉన్నాయని విమర్శించాడు. అంతేకాకుండా కొందరు పది మంది పీఆర్ లను పెట్టుకుని.. దొంగఓట్లతో గెలుస్తున్నారంటూ ఆరోపించాడు. ప్రస్తుతం నటరాజ్ మాస్టర్ కామెంట్లు యూట్యూబ్ లో వైరల్ గా మారాయి. అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటూ వెతుకులాట ప్రారంభించారు. నటరాజ్ మాస్టర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.