‘బిగ్ బాస్ ఓటీటీ’కి అనుకున్న దానికంటే మంచి రెస్పాన్సే వస్తోంది. ఇంట్లోని సభ్యులు కూడా రెండు వర్గాలు కాబట్టి గట్టిగానే కొట్టుకుంటున్నారు. టాస్కుల్లోను నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు. ఛాలెంజర్స్ కు వారియర్స్ కంటే ఎక్కవ అవకాశాలు, వరాలు కూడా ఇచ్చారు. కానీ, ఛాలెంజర్స్ తో పోలిస్తే వారియర్స్ కున్న అనుభవం బాగా ఉపయోగపడుతోంది. వారి మధ్య తగ్గాపోరు కొనసాగుతోంది. మాటలే కాదు.. చేతలకు కూడా దిగుతున్నారు.
ఈ వారం ఎలిమినేషన్ గురించి అప్పుడే టాక్ మొదలైపోయింది. నామినేషన్స్ లో నటరాజ్ మాస్టర్, అరియానా గ్లోరీ, సరయు, హమీదా, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు ఉన్నారు. ఇప్పటికే బిగ్ బాస్ తో కాస్తో కూస్తో పేరు తెచ్చుకున్న వారే ఉన్నారు కాబట్టి.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ పరంగా కచ్చితంగా సీనియర్లకు ఓట్లలో డోకా ఉండదు. ఛాలెంజర్స్ విషయానికి వస్తే కొంత మందికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి వారికి కూడా కొన్ని వారాల పాటు దిగులు ఉండదు.
కానీ, అసలు పేర్లు కూడా తెలియని వాళ్లు కొంతమంది హౌస్ లోకి వచ్చారు. వాళ్లు వారి ప్రొఫెషన్ లో కాస్త పేరు తెచ్చుకున్నా కూడా.. ప్రేక్షకులకు మాత్రం కొత్తవాళ్లే. కాబట్టి వారికి మాత్రం ఫ్యాన్ బేస్ విషయంలో తిప్పలు తప్పవు. ఓట్లు పరంగా చూసుకుంటే సీనియర్లు అందరికీ మంచిగానే ఓట్లు పడుతున్నాయి. ఛాలెజర్స్ లో ఇద్దరు నామినేషన్స్ లో ఉన్నారు. ఆర్జే చైతు- మిత్రాశర్మలతో పోల్చుకుంటే ఆర్జే చైతుకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఓట్లు బాగానే పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఈ వారం మిత్రాశర్మ ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది. ఈ వారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.