బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. రెగ్యులర్ బిగ్ బాస్ సీజన్ కంటే ఎన్నో రకాల ట్విస్టులు, ఎలిమినేషన్స్ ఓటీటీలో చూస్తున్నాం. ప్రతివారం ఎలిమినేషన్ రాగానే ఏదో షాకిస్తున్నాడు బిగ్ బాస్. అలా ఈవారం మహేశ్ విట్టా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇది నిజంగా షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే తను ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికీ తెలిసిందే. టాప్ 5 కంటెస్టెంట్ అని అందరూ అనుకున్నారు. అలాంటి మహేశ్ ను ఎలిమినేట్ చేయగానే అందరూ షాకయ్యారు. మరోవైపు ఏడు వారాలు గడిచిన తర్వాత బాబా భాస్కర్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి పంపడం ఎందుకా అని ఆశ్చర్యపోతున్నారు.
ఇదీ చదవండి: బాహుబలి-2 రికార్డులను తొక్కుకుంటూ పోతున్న KGF-2!
అయితే ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఎంతో మంది మిత్రాశర్మ, ఆమె గేమ్‌పై సెటైర్లు వేయడం, ఆమె ఎప్పుడో ఎలిమినేట్ కావాలి.. ఆమె అసలు గేమ్ ఆడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు ఆమె గేమ్ ఎలా ఉంటుంది అని స్వయంగా మహేశ్ విట్టా రివీల్ చేశాడు. ఐడు వారాల నుంచి హౌస్ లో ఉండి చాలా దగ్గరగా ఆమె ఆట తీరును గమనించిన మహేశ్ ఆ కామెంట్స్ చేయడంతో మిత్రా అసలు గేమ్ ఏంటో ప్రేక్షకులకు అర్థమవుతోంది. ఎందుకంటే హౌస్ మొత్తంలో అసలైన గేమర్ మిత్రాశర్మ అని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
‘హౌస్ మొత్తంలో మిత్రాశర్మానే అసలైన గేమర్. ఆమె ఫ్రెండ్‌షిప్, స్వార్థంలాంటి ఎమోషన్స్ ఏం లేకుండా రియల్ గా గేమ్ ఆడుతోంది. ముమైత్ ఖాన్ కెప్టెన్సీ పోటీదారుగా ఉన్న సమయంలో మిత్రా ఆమెకు కత్తి పొడిచింది. ఆ సమయంలో ఓ మాట చెప్పింది.. నువ్వు గ్యాప్ తీసుకుని వచ్చావ్. కానీ, వీళ్లు మాత్రం ఫస్ట్ నుంచి ఆడుతున్నారు. నీకంటే వీళ్లే కెప్టెన్ అయ్యేందుకు అర్హులు అని చెప్పింది. ఆ వారం మిత్రాశర్మ ఎక్కువగా ముమైత్ ఖాన్ తోనే ఉంది. కానీ, ఆమె చెప్పండంతో ఆమె గేమ్ ఏంటో అర్థమైంది. ముమైత్ ఖాన్ ఎలా రియాక్ట్ అయ్యిద్దో తెలిసి కూడా నిజాయతీగా చెప్పంది. ఇంకా హౌస్ లో ఉన్న వారిలో బిందు మాధవి, అఖిల్, యాంకర్ శివ టాప్ 3లో ఉంటారని నాకు అనిపిస్తోంది’ అంటూ మహేశ్ చెప్పుకొచ్చాడు. మహేశ్ విట్టా వ్యాఖ్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.