‘బిగ్ బాస్ ఓటీటీ’ బుల్లితెర ప్రేక్షకులను సెలా ఫోన్ కు కట్టిపడేస్తోంది. 24*7 స్ట్రీమింగ్ పేరుతో మొదలైనా కూడా.. కొన్ని గంటలు మాత్రం ఆ స్ట్రీమింగ్ ను ఆపేశారు. గతంలో లాగానే చిన్న వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. మళ్లీ మార్చి 3 అర్ధరాత్రి నుంచి లైవ్ మొదలౌతుందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే బిగ్ బాస్ లో పెట్టే టాస్కులు, ఇచ్చే ఛాలెంజ్ లు అన్నీ కూడా.. అక్కడున్న వారి మనసులో ఉన్నది బయటకు తీసేలా.. వారి ముసుగు తొలగించేలాగానే ఉంటాయి.
తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో గతంలో పాల్గొన్న కంటెస్టెంట్స్ తమ అనుభవాలను ఛాలెంజర్స్ తో పంచుకున్నారు. అందులో తెలుగు ప్రేక్షకులకు తక్కువ కాలంలో ఎక్కువగా దగ్గరైన మహేశ్ విట్టా కూడా తన అనుభవాలను పంచుకున్నాడు. అయితే చాలా సీరియస్ గా బిగ్ బాస్ హౌస్ లో కొందరు ఎలా బిహేవ్ చేస్తారు అనే విషయాన్ని వివరించాడు. ‘ఈ హౌస్ లో మనం కొన్నిసార్లు ఒక ఫ్లోలోనో.. కోపంలోనే ఒక మాట అనేస్తాం. దానిని పట్టుకుని సాగదీసి, వాడిని సంకనాకిచ్చేసి.. హౌస్ లోనుంచి బయటకు పోయేదాకా చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
మహేశ్ విట్టా బిగ్ బాస్ సీజన్-3లో పాల్గొన్నాడు. ఆ సీజన్ లో మహేశ్ విట్టాకు చాలానే ఛేదు అనుభవాలు అయ్యాయి. వాటన్నింటిలో ముఖ్యంగా మహేశ్- వితికా- వరుణ్ సందేశ్ మధ్య జరిగిన గొడవతో బాగా నెగెటివ్ అయ్యాడు. చాలా మంది వితికాదే తప్పు అని భావించినా కూడా మహేశ్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యింది. ఆ తర్వాత 12వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అప్పుడు ఎలిమినేషన్ కు వారి గొడవ కూడా ఎంతో కొంత ఉపయోగపడింది అనేది ప్రేక్షకుల భావన, మహేశ్ భావన అయిఉండొచ్చు. ఇప్పుడు మహేశ్ విట్టా మాటలు వింటే అదే అనిపిస్తోంది. మహేశ్ కామెంట్ చేసింది ఆ జంటనేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.