బిందు మాధవి తెలుగమ్మాయే అయినా టాలీవుడ్ లో ఆవకాయ బిర్యానీ తప్ప.. పెద్దగా అవకాశాలు దక్కలేదు. కానీ, కోలీవుడ్ లో మాత్రం మంచి ఫాలోయింగ్ బిందు మాధవి సొంతం. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ్వాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో బిందు మాధవి పాల్గొన్న విషయం తెలిసిందే. మొదటివారం నుంచి బిందు ఎంతో తెలివిగా, హుందా గేమ్ ఆడుతోంది. ఆమె గేమ్ చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. హౌస్ లో ఎంటర్ అయినప్పటి నుంచి ప్రతి ఎలిమినేషన్ లో ఉండటం.. తిరిగి సేవ్ అవ్వడం జరుగుతూనే ఉంది. అది చూస్తేనే అర్థమవుతుంది తెలుగు ప్రేక్షకులు ఆమెను ఎంతగా ఆదరిస్తున్నారు అనేది.
ఇదీ చదవండి: మిత్రా శర్మ మంచి మనసు! పని మనిషికి 10 లక్షలు సాయం!
సోషల్ మీడియాలో కూడా బిందు మాధవికి మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం బిందు మాధవికి ఓ కోలీవుడ్ హీరోకి మధ్య లవ్ ట్రాక్ ఉంది అని టాక్ వినిపిస్తోంది. హీరో హరీష్ కల్యాణ్ బిందు మాధవికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. గతంలోనూ ఓ కోలీవుడ్ హీరోతో బిందు మాధవి ప్రేమలో ఉందని పెద్దఎత్తున ప్రచారాలు సాగాయి. తాజాగా హరీష్ కల్యాణ్ ట్వీట్ తో మళ్లీ ఆ వార్తలు తెరపైకి వచ్చాయి. వాళ్లిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే వీళ్లద్దరూ తమిళ బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో వీరి మధ్య రిలేషన్ ఏర్పడింది అప్పట్లో రూమర్స్ వచ్చాయి. తాజాగా హరీష్ కల్యాణ్ ట్వీట్ తో మళ్లీ ఆ విషయాలు చర్చకు దారితీశాయి. బిందు మాధవి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ టైటిల్ విన్నర్ అవ్వ గలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Best wishes to my dear friend @thebindumadhavi your doing a great job in #BiggBossNonStopTelugu 🔥👌🤗#BiggBossNonStopTelugu #ShowStealerBindu
— Harish Kalyan (@iamharishkalyan) April 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.