‘బిగ్ బాస్ ఓటీటీ’ తెలుగు ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తోంది. కాంట్రవర్సీలు, కన్నీటి ఎపిసోడ్లతో మంచి హుషారుగా సాగిపోతోంది. ఇంట్లోని సభ్యులు కూడా ఎలాంటి దాపరికం లేకుండా చక్కగా గొడవలు పడుతున్నారు.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. కొన్నిసార్లు చిన్నపాటి మాట కూడా పెద్ద యూద్ధానికే దారి తీస్తోంది. జూనియర్స్ లో శివ, ఆర్జే చైతు, బిందు మాధవి బాగా టార్గెట్ అవుతున్నారు. సీనియర్స్ తో ఏ చిన్న తేడా వచ్చినా ముందు వీళ్లే రెస్పాండ్ అవుతున్నారు.
ఇదీ చదవండి: బిగ్ బాస్ OTTలోకి సోహైల్ వైల్డ్ కార్డు ఎంట్రీ? మ్యాటర్ లీక్!
టాస్కుల విషయంలో సీనియర్స్ కంటే జూనియర్స్ కాస్త సిల్లీ లాజిక్స్ తీస్తున్నారు. అదే విషయంలో వారియర్స్ చాలా సందర్భాల్లో వారి అసహనాన్ని వ్యక్త పరిచారు. కొబ్బరికాయకు పీచు పీకే టాస్కు గానీ, కేక్ మీద చెర్రీ పడిపోయే టాస్కు గానీ అలాంటి వాటిలో బిగ్ బాస్ ఇచ్చిన గైడ్ లైన్స్ లో లూప్ హోల్స్ బాగా వెతుకుతారు. తాజాగా ఇంట్లోని సభ్యులకు ఇచ్చిన బ్యాస్కెట్ బాల్ టాస్కు కూడా అలాంటి గొడవకే దారి తీసింది. ఈసారి నటరాజ్ మాస్టర్- బిందు మాధవి మధ్య వైరం చెలరేగింది.
బాస్కెట్ బాల్ టాస్కులో వారియర్స్ విజయం సాధించారు. ఆ తర్వాత వారికి ఇచ్చిన ఎన్వలప్ లో లగేజ్ కావాలా? బెడ్ రూమ్ కావాలా? అని ఉంటుంది. అందుకు సీనియర్స్ లగేజ్ కావాలని డిసైడ్ అయ్యి వెళ్లిపోయారు. అయితే అక్కడ ఛాలెంజర్స్ డిసైడ్ చేయాలని ఉంది. కానీ, వారి పర్మిషన్ అడగకుండా వెళ్లిపోయారు. ఆ విషయాన్ని వెళ్లి సీనియర్స్ కు చెప్పారు. ఆ సమయంలో నటరాజ్ మాస్టర్ అందం అనేది పైకి కనిపించేది కాదు.. లోపల ఉండే మనసును బట్టి చూడాలని కామెంట్ చేస్తాడు. ఆ మాట విన్న బిందు ఏదున్నా ఫేస్ టూ ఫేస్ మాట్లాడండి అంటూ ఫైర్ అవుతుంది. అలా కాసేపు వారి మధ్య మినీ యుద్ధమే జరిగింది. నటరాజ్ మాస్టర్- బిందు గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.