బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. 24 గంటల స్ట్రీమింగ్ అయినప్పటికీ గొడవలు, కేకలతో బిందాస్ గా సాగిపోతోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ అయినప్పటికీ ఇప్పుడు గ్రూపుల మధ్య కాస్త స్నేహం పెరిగింది. ఇప్పుడు పరిచయం, అవసరాన్ని బట్టి జట్లు మారిపోయారు. నాలుగో వారం ఇంటి నుంచి సరయు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐదోవారం ఇంటి నుంచి పంపేందుకు నామినేషన్స్ కూడా జరిగాయి. వాటిలో అరియానా, అషురెడ్డి, అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, మహేశ్ విట్టా, బిందు మాధవి, యాంకర్ శివ నామినేట్ అయ్యారు.
ఇదీ చదవండి: అఖిల్ కి అషు రెడ్డి భార్యలా ఉంటోంది: సరయు
ఈ నామినేషన్స్ కూడా ఎప్పటిలాగానే బాగా కోపంగా, ఆరోపణలు, ప్రత్యారోపణలతో సాగిపోయాయి. వాటన్నింటిలో అందరి దృష్టిని ఆకర్షించింది. మిత్రా శర్మ- యాంకర్ శివల మధ్య జరిగిన వైరం. మొదటి నుంచి వాళ్లు బాగానే ఉన్నట్లు కనిపించినా కూడా వారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. అది తాజా నామినేషన్స్ లో బయటపడింది. మిత్రాశర్మ- శివకు ఫేక్ ఇచ్చిన సంగతిని గుర్తుచేస్తూ నువ్వైతే ఫేక్ ఇచ్చేస్తావ్ అంటూ శివ ఫైర్ అయిపోయాడు. మిత్రా కూడా కోపంగా శివకు సమాధానం చెప్పింది ఆ క్రమంలోనే వారి మధ్య గొడవ పెద్దది అయిపోయింది. నువ్వే ఫేక్ కాదు నువ్వే ఫేక్ అంటూ మివర్శించుకున్నారు. తాను అన్నయ్య అనుకున్నా శివ మాత్రం అలా అనుకోవడం లేదని మిత్రా ఆరోపణ. తన గురించి అందరి దగ్గర లేనివి చెబుతోందని శివ వాదన. మిత్రా శర్మ- యాంకర్ శివ వీరిలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.