బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించే పరిస్థితి లేదు. తాజా డబుల్ ఎలిమినేషన్ తో అందరూ అదే నిర్ణయానికి వస్తున్నారు. హౌస్ నుంచి ఈ వారం ముమైత్ ఖాన్, స్రవంతి చొక్కారపు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి వచ్చినా కూడా ముమైత్ దానిని సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. ఇంక స్రవంతి విషయానికి వస్తే.. మొదటి నుంచి ఆమె గ్రూప్ ప్లేయర్ అంటూ హౌస్ లో కూడా కామెంట్స్ వినిపించాయి. ఇంక ఆరోవారం ఎలిమినేట్ అయిపోయింది. ఇంక సగం రోజులు మాత్రమే ఉండటంతో హౌస్ లో వాతావరణం వేడెక్కింది.
ఇదీ చదవండి: తల్లి కాబోతున్న హీరోయిన్ ప్రణీత.. ఫొటోస్ వైరల్
ఈ వారం జోడీ నామినేషన్స్ పెట్టడంతో ఇంట్లో పరిస్థితి బాగా వేడెక్కింది. ఎప్పుడు ఎలాంటి రచ్చ చెయ్యాలో బిగ్ బాస్ కు బాగా తెలుసని మళ్లీ రుజువైంది. ఎవరికైతే ఇంట్లో అస్సలు పడదో.. వాళ్లనే జోడీగా నిల్చొబెట్టాడు. వాళ్లలో వాళ్లు బాగానే కొట్టుకున్నారు. వారిలో ముఖ్యంగా యాంకర్ శివ– నటరాజ్ మాస్టర్, బిందు మాధవి- అఖిల్.. ఈ రెండు జోడీల మధ్య సాధారణంగానే పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటుంది. అలాంటింది నామినేషన్స్ లో డిఫెండ్ చేసుకోండి అనడంతో అసలు రచ్చ మొదలైంది. నటరాజ్ మాస్టర్ అయితే శివను వదిలేది లేదని తేల్చేశాడు. మరోవైపు శివ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చాడు.ఇంక బిందు మాధవి– అఖిల్ విషయానికి వస్తే.. వారి మధ్య సీజన్ స్టార్టింగ్ నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అఖిల్ కి టైటిల్ పోరులో బిందు గట్టి పోటీ అని ముందే గ్రహించిన అఖిల్ ఆమెతో శత్రుత్వం కొనసాగిస్తున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. అటు బిందు కూడా అఖిల్ విషయంలో ఎక్కడా తగ్గడంలేదు. మాటకు మాట ఇచ్చి పడేస్తోంది. తాజాగా నామినేషన్స్ లో అయితే అది కాస్త శ్రుతి మించింది కూడా. మాటల్లో వాళ్లిద్దరూ లైన్స్ క్రాస్ అయ్యారు. బిందు అయితే ఒరే అఖిల్.. చెప్పరా అంటూ కామెంట్ చేసింది. అందుకు అఖిల్ ఉండి ఒసేయ్ బిందు ఏం చెప్పమంటావ్ అంటూ క్వశ్చన్ చేశాడు. వీళ్లద్దరి మాటలు విని హౌస్ లో సభ్యులు ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.