బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1 దాదాపు ముగిసినట్లే.. మే 21న సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఈ సీజన్ లో విన్నర్ గా బిందు మాధవి నిలిచినట్లు అందరికీ తెలిసిపోయింది. కాకాపోతే అధికారిక ప్రకటన ఒకటి మాత్రం రావాల్సి ఉంది. ఇంక రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచినట్లు సమాచారం. వాళ్ల తర్వాత రెండో రన్నర్ గా శివ, మూడో రన్నర్ గా అరియానా, నాలుగో రన్నర్ మిత్రా శర్మ నిలిచినట్లు తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా బిందు మాధవి ఎంత మొత్తం గెలుచుకుంది అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. ఆమెకు అసలు ఎంత మొత్తం ముట్టజెప్పారో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది.
నిజానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ 12 వారాలే నిర్వహించినా కూడా.. సాధారణ సీజన్ లాగానే ప్రైజ్ మనీ రూ.50 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఈ సీజన్‌లో అనీల్ రావిపూడి తీసుకొచ్చిన రూ.10 లక్షల సూట్ కేస్ ను అరియానా అందుకుని టైటిల్ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ పది లక్షలు విన్నర్ ప్రైజ్ మనీ నుంచే ఇస్తారు కాబట్టి విన్నర్ బందు మాధవికి విన్నింగ్ అమౌంట్ గా రూ.40 లక్షలు మాత్రమే దక్కే అవకాశం ఉంది.
అరియానా ఎంతో తెలివిగా నిర్ణయం తీసుకుని ఆ రూ.10 లక్షలు తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే బిందు మాధవికి ప్రైజ్ మనీ రూ.40 లక్షలతో పాటుగా 12 వారాలపాటు హౌస్ లో ఉన్నందుకు రెమ్యూనరేషన్ కూడా దక్కుతుంది. విన్నర్ బిందు మాధవికి ఎలా లేదన్నా తక్కువలో తక్కువ వారానికి రూ.2 లక్షల వరకూ ఇచ్చే అవకాశం ఉంది. అలా రెమ్యూనరేషన్ మొత్తం ఓ రూ.25 లక్షలు వచ్చినా.. ఆమెకు ప్రైజ్ మనీ + రెమ్యూనరేషన్ కలిపి రూ.65 లక్షల నుంచి 70 లక్షల వరకూ దక్కే అవకాశం ఉంది.
ఇంక యాంకర్ శివ విషయానికి వస్తే.. అతను రూ.10 లక్షలు వదులుకుని తప్పు చేశాడంటూ కామెంట్ చేస్తున్నారు. కాకాపోతే కింగ్ నాగార్జున యాంకర్ శివకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి యాంకర్ శివకు అవకాశం కల్పించారంట. అలా శివకు కూడా న్యాయం జరిగిందంటూ చెబుతున్నారు. బిందు మాధవి విన్నర్ కావడంపై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.