అచ్చ తెలుగు అందం బిందు మాధవి.. గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించి.. ఆవకాయ్ బిర్యానీ సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది బిందు మాధవి. అయితే తెలుగులో ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో.. తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ ఓటీటీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముదుకు వచ్చింది బిందు మాధవి. బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో కాస్త ఇంట్రెస్ట్‌గా, పద్దతిగా, చూడముచ్చటగా కనిపించే కంటెస్టెంట్లలో బిందు మాధవి ముందుంటుంది. తెలుగు వారికి దగ్గరవ్వాలన్న ఉద్దేశ్యంతోనే ఈ బిగ్ బాస్ ఓటీటీలోకి వచ్చానని తెలిపిందే. అయితే ఇంతకు ముందే తమిళ బిగ్ బాస్ షోలో బిందు మాధవి పాల్గొంది.
ఇది కూడా చదవండి : తన లవ్ స్టోరీ బయట పెట్టిన మహేష్ విట్టా! అమ్మాయి ఎవరంటే?
ఈ క్రమంలో హౌస్‌లోని కంటెస్టెంట్లు వారి వ్యక్తిగత విషయాలను హౌస్‌మేట్స్‌తో పంచుకోవాలనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దానిలో భాగంగా హీరోయిన్ బిందు మాధవి తన లవ్ లైఫ్‌ను వివరించింది. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక వ్యక్తిని ఇష్టపడ్డానని.. ఇద్దరం ప్రేమించుకున్నామని, కానీ కెరీర్ కోసం దూరమవ్వాల్సి వచ్చిందని తెలిపింది. అతడు పై చదువుల కోసం అమెరికా వెళ్లిపోగా తాను నటన మీదున్న ఆసక్తితో సినీరంగంలోకి వచ్చేశానని పేర్కొంది. అయితే ఇప్పటికీ ఆ రిలేషన్ తనకెంతో స్పెషల్ అన్న బిందు మాధవి ప్రియుడి పేరును మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు, అతడికి పెళ్లి అయిపోయిందని కూడా తెలిపింది.
ఇది కూడా చదవండి : బిగ్ బాస్ హౌస్ లో బోరున ఏడ్చేసిన ముమైత్ ఖాన్!
కాగా ప్రియుడితో బ్రేకప్ అయిన సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని గతంలో బిందు మాధవి బిగ్‌బాస్ స్టేజీ మీదే చెప్పుకొచ్చింది. అలాంటి సమయంలో తమిళ బిగ్‌బాస్ నుంచి ఆఫర్ రావడంతో షోకి వెళ్లగా.. కొన్నిరోజుల్లోనే డిప్రెషన్ నుంచి బయటపడినట్లు చెప్పింది. ఇప్పుడు తెలుగులోనూ ఛాన్స్ రావడంతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు నాన్‌స్టాప్ షోలో అడుగుపెట్టింది బిందు మాధవి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.