బిగ్ బాస్ ఓటిటిలో మొదటివారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఈ సీజన్ 24 గంటలపాటు ప్రసారం అవుతుండటంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. షో మొదలైన మొదటి వారం నామినేషన్స్ కే హౌస్ లో ఊహించని స్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. నామినేషన్స్ ప్రక్రియలో హౌస్ మేట్స్ అందరూ ఒకరిపై ఒకరు వివిధ కారణాలతో నామినేట్ చేసుకున్నారు.
ఇక మొదటివారం నామినేషన్స్ లో.. నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, హమీదా, అరియానా, మిశ్రా శర్మ ఆర్జే చైతు నామినేట్ అయ్యారు. నామినేషన్స్ ముగిసేసరికి.. బిగ్ బాస్ ఫినాలే టైంలో రియాక్ట్ అయినట్లుగా కామెంట్స్ చేసుకున్నారు కంటెస్టెంట్స్. అయితే.. చివరిలో ఆర్జే చైతు.. అద్దానికి తల బాదుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతలో చైతును ఓదార్చేందుకు మిగతా సభ్యులు వెళ్లారు.అదీగాక నామినేషన్స్ లో ఎక్కువ మంది తననే నామినేట్ చేయడంతో నటరాజ్ మాస్టర్ ఏడుస్తూ.. మోకాళ్లపై నిలబడి సారీ చెప్పడం హైలైట్ గా నిలుస్తోంది. మరి మొత్తానికి మొదటివారమే ఇంటి సభ్యులలో ఇంతలా సీరియస్ రియాక్షన్ రావడం చూసి బిగ్ బాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి ఈ వారం నామినేట్ అయినవారి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.