ఈ మధ్యకాలంలో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ 5వ సీజన్ గ్రాండ్ ఫినాలే రోజునే ఓటీటీ వెర్షన్ రెండు నెలల్లో ప్రత్యక్ష ప్రసారం కానుందని నాగార్జున ప్రకటించాడు. అయితే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ ఓటిటి షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అని ప్రేక్షకులు అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా డిస్నీ హాట్‌స్టార్.. బిగ్ బాస్ కు సంబంధించి సరికొత్త అప్ డేట్ అందించింది.
చదవండి:
దీప్తితో బ్రేకప్.. తన అన్న పై షణ్ముఖ్ సోదరుడు సెటైర్స్!
Bigg Boss OTT Telugu: కంటెస్టెంట్ గా పుష్ప యాంకర్..
ఓటీటీ ఆన్ లైన్ వెర్షన్ స్ట్రీమింగ్ లోగోను షేర్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన అప్ డేట్ ను విడుదల చేసింది. “2022 బిగెస్ట్ సర్పైజ్ ఇక్కడ ఉంది. #BiggBoss NonStop 24/7 వినోదాన్ని అందిస్తుంది! బిగ్ బాస్ హౌస్ నుండి నేరుగా డిస్నీ ప్లస్ హెచ్ఎస్ లో మాత్రమే. ఈ వినోదం అతి త్వరలో మీ చేతుల్లోకి రానుంది” అంటూ Disney+ Hotstar హ్యాండిల్ నుండి లోగోను షేర్ చేసింది. ఈ ఓటీటీ షో కోసం ఇప్పటికే పోటీదారులు ఎంపికయ్యారు. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో ఫిబ్రవరి 27న మొదలు కానుందని టాక్ వినిపిస్తుంది. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ.. లోగో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The Biggest Surprise of 2022 IS FINALLY HERE.#BiggBossNonStop promising 24/7 entertainment! DIRECT from the Bigg Boss house, only on @DisneyPlusHS This entertainment marvel will be reaching your hands very soon.@BiggBoss @DisneyPlusHSTel #BiggBoss pic.twitter.com/vH9fNrbgRN
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 9, 2022