బిగ్ బాస్ ఓటిటి సీజన్-1 విజేతగా తెలుగమ్మాయి బిందు మాధవి ట్రోఫీని అందుకుంది. ఇప్పటివరకు తెలుగులో ప్రసారమైన బిగ్ బాస్ అన్ని సీజన్లలో అబ్బాయిలే గెలుస్తూ వచ్చారు. మొట్టమొదటిసారి బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న అమ్మాయిగా బిందు మాధవి రికార్డు సృష్టించింది. కెరీర్ పరంగా ఆమె నిరాశలో ఉన్నప్పటికీ.. బిగ్ బాస్ ట్రోఫీ ఆమెకు లైఫ్ లో కొత్త ఆశను కలిగించిందని బిందు మాధవి ఫినాలేలో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
హౌస్ లో ఎంతో పోరాడింది. తనను పడేయాలని ప్రయత్నించిన ప్రతిసారి నిలబడి తన సత్తాను నిరూపించింది. ఆటలో ఆడపులి అనిపించుకుని.. చివరి వరకూ సహనంతో.. తెలివైన ఆటతీరుతో బిందు మాధవి తెలుగు బిగ్ బాస్ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికింది. బిగ్ బాస్ టైటిల్ తో పాటు రూ. 40 లక్షల క్యాష్ ప్రైజ్ అందుకున్న తొలి లేడీ కంటెస్టెంట్ గా బిందు షోలో కొత్త ఊపునిచ్చింది. తన మాటే బలహీతనగా భావించిన బిందు.. అదే మాటతీరుతో అందరినీ ఆకట్టుకుని.. విజేతగా నిలిచింది. ఫినాలేలో కూడా అద్భుతంగా మాట్లాడి మెప్పించింది.
The sensation in the history of biggboss 🥳💃#ConquerorBinduMadhavi @thebindumadhavi #BinduMadhavi pic.twitter.com/alchP5oGpf
— Trends Bindu (@TrendsBindu) May 21, 2022
సొంత స్ట్రాటజీతో గేమ్ ఆడిన బిందు.. ఆట తప్ప వేరే ధ్యాస లేదన్నట్టుగా చివరివరకూ కంటిన్యూ అయ్యింది. హౌస్ లో ఎవరితో బాండింగ్ ఉంచుకోవాలి.. ఎవరికి దూరంగా ఉండాలి.. అనే విషయాలలో పక్కా స్ట్రాటజీ ఉపయోగించింది. ముందు చూపుతో ఆలోచించి టైటిల్ విన్నర్ గా నిలవడం ఖచ్చితంగా ఆమెను అభినందించాల్సిన విషయం. ఈ క్రమంలో ట్రోఫీ అందుకొని భావోద్వేగానికి గురైన బిందు.. “లేట్ బ్లూమర్స్ కి ఈ ట్రోఫీ అంకితం చేస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఆ కోవకు చెందినదాన్నే. నా లైఫ్ లో అన్ని ఆలస్యంగానే వస్తాయి. సక్సెస్ కూడా అంతే. ఏ రంగంలోనైనా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. నన్ను ఆదరించి, ఓట్లు వేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు” అంటూ మాట్లాడింది. ప్రస్తుతం బిందు మాధవి ట్రోఫీ అందుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి బిగ్ బాస్ విజేతగా నిలిచినా బిందు మాధవిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#BinduMadhavi
Winning speech❤
More connected with your words @thebindumadhavi#BiggBossNonStopTelugu#BiggBossNonStop#BinduTheSensation#ConquerorBinduMadhavi
pic.twitter.com/pjANPQI3w9— Mr.Cool (@itsmeMrCool) May 21, 2022