‘మహేశ్ విట్టా’ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. కమేడియన్ గా కెరీర్ ప్రారంభించి.. సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించే స్థాయికి ఎదిగాడు. బిగ్ బాస్ సీజన్-3లో అలరించి.. మళ్లీ బిగ్ బాస్ ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటితో పోలిస్తే చాలా సహనం, ఓపిక ప్రదర్శిస్తున్నాడు. ఊరికే కోపం తెచ్చుకోవడం, అరిచేయడం కాకుండా చాలా హుందా ప్రవర్తిస్తున్నాడని ప్రేక్షకులు కూడా మెచ్చేసుకుంటున్నారు.
తాజాగా మహేశ్ విట్టా పెళ్లి విషయం బాగా వైరల్ గా మారింది. బిగ్ బాస్ ఓటీటీ ఎంట్రీ టైమ్ లో తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. తాను ఎవరిని చేసుకోబోతున్నాడు? ఎప్పుడు పెళ్లి జరుగుతుంది? ఎక్కడ వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చేశాడు. రిజెక్ట్ చేసిన అమ్మాయే ఓకే చెప్పిందని.. నాలుగేళ్లుగా తమ ప్రేమ కొనసాగుతోందని చెప్పుకొచ్చాడు. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు చెప్పి మురిసిపోయాడు.
‘ఒక అమ్మాయిలో రిలేషన్ లో ఉన్నాను. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. నా చెల్లెలి ఫ్రెండ్ తను. కలిసిన రెండోసారే ప్రపోజ్ చేశాను. తను రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ప్రపోజ్ చేసిన రెండేళ్లకు ఓకే చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఊరిలోనే మా వివాహం జరుగుతుంది. నేను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా రిలీజ్ అయ్యాకి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం’. అమ్మాయి పేరు చెప్పను. తనకు ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. తను ఒక ఐటీ ఉద్యోగి. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం’ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. మహేశ్ విట్టా కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.