బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, టాస్క్ లు షో పై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. 24 గంటలు ప్రేక్షకులను కట్టిపడేయాలంటే అవే కావాలనుకునే వారి కోసం.. వారియర్స్ Vs ఛాలెంజర్స్ అనే కాన్సెప్ట్ పెట్టి ఉండచ్చని అనుకుంటున్నారు. ఇలా ప్రతివారం ఏదో ఒక కాన్సెప్ట్ తో అందరిని ఆకట్టుకుటుంది బిగ్ బాస్. అలానే తాజాగా విడుదలైన ప్రోమో కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈసారి హౌస్ గుర్రం బొమ్మలపై కూర్చోని అంశంపై బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బిందు మాధవికి, అఖిల్ ల మధ్య కూడా డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. అది కాస్తా పెద్ద గొడవకు దారితీసింది.
మొదటి వారం నామినేషన్స్ సమయంలో అఖిల్ ని నామినేట్ చేసింది బిందు మాధవి. ఆ సమయంలో అఖిల్ కారణంగానే గేమ్ ఆగిపోయిందని.. అతడు వారియర్స్ టీమ్ ని కంట్రోల్ చేస్తున్నాడంటూ గతంలో కామెంట్స్ చేసింది. గుర్రం గేమ్ ఆడే సమయంలో అషు రెడ్డి.. శివతో మాట్లాడుతూ..నామినేషన్ లోకి బిందు నిన్ను పంపిచడానికి సిద్దంగా ఉన్నప్పుడూ.. సెల్ఫ్ సెంటెడ్ కెప్టెన్ లాగా తనను ఎలా పెట్టుకుంటావు అని అడుగుతుంది. ఫ్రెండ్స్ విషయంలో అలాంటివి ఉండవు అంటాడు. ఇదే క్రమంలో బిందు మాధవి అందుకుని.. దీనికి గురించి మాట్లాడే కేటగిరిలోనే మీరు లేరంటుంది. ఇంతలో మధ్యలో వచ్చిన అఖిల్.. మీరు పోటీదారులు గా ఎన్ని సార్లు ఎన్నికైనారు అని బిందు మాధవిని ప్రశ్నిస్తాడు.“నేను అవ్వలేదండి. ఎందుకంటే మీరు నన్ను టార్గెట్ చేసి బయటకి పంపే ప్రయత్నం చేస్తున్నారు” అని బిందు మాధవి అంటుంది. ఎందుకు మీరు ప్రతిసారి టార్గెట్ చేశాను అని వాడుతున్నారు అంటూ అఖిల్ ఫైర్ అవుతాడు. ఈ క్రమంలో బిందు మాధవి అన్న మాటలకు అఖిల్ కన్నీరు పెట్టుకున్నట్లు మనకి ప్రోమోలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఆమె గొడవను పెద్దది చేయలేదు. అక్కడ మిస్ అండర్ స్టాండింగ్ మాత్రమే అయ్యి ఉండవచ్చు అని కామెంట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోపై మీరు ఓ లుక్కేయండి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.