బిగ్ బాస్ రియాలిటీ షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇదివరకు 5 సీజన్లు ముగించుకున్న ఈ షో.. ప్రస్తుతం ఓటిటి వేదికగా ‘బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్’ అంటూ ప్రసారం అవుతోంది. ఈ బిగ్ బాస్ ఓటిటి సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే.. గతంలో బిగ్ బాస్ షోకి ఉన్న ఆదరణ ఈసారి ఓటిటి షోకి లేదనే చెప్పాలి. మొదటి నుండి ఈ ఓటిటి వెర్షన్ పై ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు.
అయినాసరే ఏదో విధంగా ఉన్నవాళ్లతోనే కానిచ్చేస్తున్నారు నిర్వాహకులు. కానీ బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న కొన్ని సంఘటనలపై ప్రేక్షకులకు చిర్రెత్తుకొస్తుంది. అసలు బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ చేయాల్సింది ఏంటి.. అక్కడ కెమెరాల ముందే జరుగుతున్న ఘోరాలు ఏంటని అభిప్రాయ పడుతున్నారు నెటిజన్స్. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది ఇటీవల అషురెడ్డి – నటరాజ్ మాస్టర్ ల మధ్య జరిగిన సంఘటన.
ఇటీవల హౌస్ లో అషురెడ్డి చీరకట్టుకొని నడుము చూపించడంతో నటరాజ్ మాస్టర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ‘ఎంత అందంగా ఉన్నావో.. రోజురోజుకూ ఏంటిది? ఏంటి బిగ్ బాస్ ఇదీ అషు సెగలు పుట్టిస్తుంది. మాకు ఈ శివరాత్రులు ఏంటి? జాగారాలు ఏంటో అని అషురెడ్డి అందాన్ని తెగ పొగిడేశాడు నటరాజ్. అంతొద్దు మాస్టర్.. అని అషు అంది. ‘నిజం చెప్తున్నా.. ఎదురుగా ఉండి మనస్పూర్తిగా ప్రేమించేవాళ్లు అమ్మాయిలకు కనిపించరు. తెలుసుకునే లోపు ఏముండదు. ఎంత అందంగా ఉన్నావో.. అంటూ ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు.
హౌస్ లో వీరిద్దరి మధ్య ఈ రొమాంటిక్ కన్వర్జేషన్ డోసు ఎక్కువయ్యేసరికి ఈ పెంట మాకెందుకు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. పోనిలే ఏదో ఓ ఎపిసోడ్ అయినా కాసేపు చూద్దాం అనుకునే ప్రేక్షకులకు.. ఈ సొల్లు కబుర్లు ఏంటని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇదివరకు బిగ్ బాస్ ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందంటూ మండిపడుతున్నారు. మరి హాట్ టాపిక్ గా మారిన అషురెడ్డి – నటరాజ్ మాస్టర్ ల సంభాషణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.