బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ దాదాపుగా ముంగిపు దశకు చేరుకుంది. ఇంకా హౌస్ లో అఖిల్, బిందు మాధవి, యాంకర్ శివ, బాబా భాస్కర్, నటరాజ్ మాస్టర్, అరియానా, అనీల్, మిత్రా శర్మ ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ 5కి చేరుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. గతవారం హౌస్ నుంచి అషురెడ్డి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆమెతో యాంకర్ రవి చేసిన బిగ్ బాస్ బజ్ లో చెప్పిన కొన్ని విషయాలు వైరల్ గా మారాయి. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో స్మోకింగ్ చేయడం కామన్, అది వాళ్ల వ్యక్తిగతంకూడా. అన్ని సీజన్లలో మేల్ కంటెస్టెంట్లే కాదు, ఫీమేల్ సభ్యులు కూడా చేస్తుంటారు. ఈ సీజన్లో తేజస్వి, ముమైత్, హమీదా స్మోక్ చేయడం చూశాం.
ఇదీ చదవండి: బిగ్ బాస్ లో టైటిల్ కొట్టిన తొలి లేడీగా బిందు మాధవి రికార్డు సృష్టించనుందా!
అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో చాలా మంది సీక్రెట్ గా బిగ్ బాస్ ఇచ్చిన స్మోకింగ్ ఏరియాలో కాకుండా బయట కూడా స్మోక్ చేస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోల్లో చూసిన తర్వాత సీక్రెట్ స్మోకింగ్ పై ప్రేక్షకులకు సైతం ఓ క్లారిటీ వచ్చింది. బిగ్ బాస్ బజ్ లో ఆ విషయంపై యాంకర్ రవి అషూరెడ్డిని గట్టిగానే అడిగాడు. ఆమె ఎంత దాటవేయాలని ప్రయత్నించినప్పటికీ రవి మాత్రం అదే విషయంపై గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగాడు. చివరికి అషూరెడ్డి తప్పించుకోలేక సమాధానం చెప్పింది. కాకపోతే అదికూడా పూర్తిగా చెప్పలేదులెండి.
‘నేను దూ**లెక్కి స్మోకింగ్ చేశాను.. తగ్గించుకుని ఉంటే బాగుండేది. అదేం మిస్టేక్ కాదు. సీక్రెట్ గా స్మోకింగ్ చేయడం నా ఛాయిస్. నేను ఇంక మాట్లాడితే ఆ ప్లేయర్ కు ఎఫెక్ట్ అవుతుంది’ అంటూ అషూరెడ్డి చెప్పుకొచ్చింది. అయితే సోషల్ మీడియాలో అషురెడ్డి- అఖిల్ కలిసి లైటర్ తీసుకెళ్లడం, ఆమె బాత్ రూమ్ లో స్మోకింగ్ చేయడం, ఆ సమయంలో అఖిల్ ఆమెకోసం కాపాలా కాయడం ఇలా అన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈ సీక్రెట్ స్మోకింగ్ గురించి అఖిల్, అషు మాట్లాడిన డైలాగులను కూడా వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం అషూరెడ్డి స్వయంగా కామెంట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అషు సీక్రెట్ స్మోకింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.