‘బిగ్ బాస్ ఓటీటీ’ కూడా సక్సెస్ ఫుల్ గానే కొనసాగుతోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి విషయంలో వారి మధ్య పోటీ పెట్టడం.. గెలిచిన వారికే వరాలు ఇస్తుండటంతో అవతలి వారికి మంట బాగా పెరిగిపోతోంది. ఆ మంటతోనే అవకాశం దొరికినప్పుడల్లా గొడవలు పడుతున్నారు. వారిలో వారు కొట్టుకుంటూ ప్రేక్షకులను మాత్రం ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఆ తాపత్రయంలో కాస్త శ్రుతిమించుతున్నారు కూడా.
ప్రస్తుతం హౌస్ లో అషురెడ్డి- అరియానా- అజయ్ సమయం దొరికినప్పుడల్లా డబుల్ మీనింగ్ డైలాగులు విసురుతున్నారు. మంగళవారం అయితే ఎంటర్ టైన్మెంట్ పేరుతో ఓ బుల్లిసైజ్ గబ్బు స్కిట్ ప్లాన్ చేశారు. అషురెడ్డికి ఆ స్కిట్ దర్శకత్వ పర్యవేక్షణతో పాటు నటించింది కూడా. అజయ్ ఒక భర్త అతనికి అషురెడ్డి భార్య, అరియానా మరదలు యాక్షన్ అనగానే తెగ జీవించేశారు. వారి డైలాగులు చూసి ప్రేక్షకులు ముక్కునే వేలుసుకున్నారు. వారి సంభాషణ అదే విధంగా…
అరియానా: నాకు మా బావంటే ఇష్టం
అషురెడ్డి: నాకు నా మొగుడంటే ఇష్టం.. నువ్వెవర్తివే నా మొగుడ్ని చూడటానికి? దొంగ మొహం దానా..
అరియానా: నువ్వెవరే మా బావని చూడ్డానికి?
అషురెడ్డి: నేను వాడితో తాళి కట్టించుకున్న పెళ్లాన్ని.
అరియానా: మా అక్కకి మొగుడు
అషురెడ్డి: నేను ఉండగా నువ్ దాన్ని ఎందుకు గోకుతున్నావ్ అజయ్.. సిగ్గులేదా? నీకు ఒక్కరు సరిపోరా? మినిషివా పశువువా?
అజయ్: సరే ఏంటి ఇప్పుడు?
అరియానా: అజయ్ బావా.. వీలైతే నాలుగు మాటలు- కుదిరితే కప్పు కాఫీ
అషురెడ్డి: నాతో అరకప్పు కూడా తాగనంటావ్.. దాంతో రెండు కప్పులు తాగుతావా?
అరియానా: బావా అది పాత చింతకాయ పచ్చడి దాన్ని వదిలెయ్.. నాతో వచ్చెయ్
అషురెడ్డి: నువ్వేంటి రోటి పచ్చడివా? నువ్ ఆ దిండు తీసుకుని బయటకు పో
అజయ్: నువ్వు ఉండగా.. దిండు ఎందుకు? మరదలా.. నీ దగ్గర దిండు ఉందా?
అరియానా: బావా రా..
అషురెడ్డి: పక్కింటోడి బాల్కనీ ఓపెన్ చేశాడంట.
అజయ్: వాడు కాడా అదే చేసేది.. మీరు చేస్తే చమత్కార్.. మేం చేస్తే బలాత్కార్ ఆ?
అషురెడ్డి: బలత్కార్ చేస్తున్నావ్..
ఈ విధంగా వారి సంభాషణ ఫన్ తో మొదలై అడల్ట్ కంటెంట్ దాకా వెళ్లింది. బలత్కార్ అంటూ రెచ్చిపోయారు. అషురెడ్డి- అరియానా బోల్డ్ కామెంట్స్ లో ఎక్కడా తగ్గడం లేదు. హౌస్ లో డబుల్ మీనింగ్ డైలాగుల హవా నడుస్తోంది. ఈ ముగ్గురి స్కిట్ పై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇంటిల్లిపాది కూర్చొని చూడాలంటే అలాంటి బలాత్కార డైలాగులు వేస్తే ఎలా చూస్తారు పిల్లలతో కూర్చొని అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.