‘బిగ్ బాస్ ఓటీటీ’ ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాదు.. కొన్ని విషయాల్లో ఆగ్రహానికి కూడా గురవుతోంది. ఛాలెంజర్స్ Vs వారియర్స్ కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంటోన్నా.. ప్రతి విషయంలో గొడవలు పడటం మాత్రం చాలా మంది ప్రేక్షకులకు నచ్చడం లేదు. పైగా కొందరు ఇంటి సభ్యులు కూడా కంటెంట్ ఇవ్వడానికే ఉన్నాం అనేలా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా అషురెడ్డి, అరియాన, నటరాజ్ మాస్టర్ మాత్రం ఎక్కడున్నా క్లోజ్ పడేలా జాగ్రత్త పడుతున్నారు. విషయం చిన్నదైనా పెద్దదైనా వారిపై ఫోకస్ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ విషయంలో జూనియర్స్ కంటే సీనియర్లే ఒకడుగు ముందున్నారు.
ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్ లో గలీజ్ పంచాయతీ! బెడ్ పై రెచ్చిపోయారు!
వీళ్లు మరికొన్ని సందర్భాల్లో రెచ్చిపోతున్నారు కూడా. అషు వెళ్లి అజయ్- అరియానాతో కూర్చొని స్కిట్ అనే పేరుతో ఒక చిన్న 18+ సినిమా డైలాగులు వేసేశారు. అజయ్ కూడా డబుల్ మీనింగ్ డైలాగులు వాడేస్తున్నాడు. ఇప్పుడు అషు- అఖిల్ మధ్య జరిగిన సీన్ కూడా ఒకటి ప్రేక్షకులను ఇరిటేట్ చేసింది. అఖిల్ సహజంగా ఛాతిపై బటన్ పెట్టడు. అతని చెస్ట్ మీదున్న టాటూ కనపడేలా డ్రెస్ చేసుకుంటాడు. అటుగా నడిచొస్తున్న అఖిల్ ను బటన్ పెట్టు అని అషు అడుగుతుంది.
ఆమె ఆ మాట అందోలేదో అఖిల్ ఇంకో బటన్ తీసి ఛాతి చూపిస్తాడు. లేదంటే ఇక్కడ దాకా పెట్టుకోమంటావా అంటాడు. అందుకు అషురెడ్డి అవును పెట్టుకో అనగానే.. అలా అయితే మీరు బెడ్ షీట్లు కట్టుకుని తిరగాలి అంటూ అఖిల్ కామెంట్ చేస్తాడు. అయితే వారి మాటల విషయం పక్కన పెడితే అషురెడ్డి.. అఖిల్ చొక్కా పట్టుకని లాగడం. అఖిల్ బటన్ విప్పి ఛాతి చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్ కు ఒకింత చిరాకు తెప్పించింది. బిగ్ బాస్ పై పాజిటివ్ టాక్, నెగిటివ్ టాక్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ, ఈసారి పాజిటివ్ కంటే నెగెటివ్ టాకే ఎక్కువగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అఖిల్- అషు చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.