బిగ్ బాస్ ఓటిటి హౌస్ లో సభ్యుల మధ్య పరిస్థితులు వేడెక్కుతున్నాయి. మొదలైన వారానికే అందరిలోనూ అపార్థాలు, కోపాలు అన్ని ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈసారి బిగ్ బాస్ యాజమాన్యం కూడా కొత్తగా ప్లాన్ చేయాలని భావించిందేమో.. రానురాను సభ్యుల మాటలకు అర్థాలు హద్దులు దాటిపోతున్నాయి. తమకు తాము బోల్డ్ అని చెప్పుకుంటున్నారు ఓకే.. అయితే బోల్డ్ నెస్ అనేది మీ స్వభావం ఎంత స్ట్రాంగ్ అనేది చూపించాలి.. కానీ ఇలా హద్దుమీరిన మాటల్లో కాదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రేక్షకులు ఇలా భావించడానికి కూడా కారణం లేకపోలేదు. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో సభ్యులంతా స్పిన్ వీల్ అనే గేమ్ అందరూ. ఆ ఆటలో వీల్ ఎవరి దగ్గర ఆగుతుందో వారు సీక్రెట్ క్వశ్చన్స్ కి నిజాయితీగా జవాబులు చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలో స్పిన్ వీల్ యాంకర్ అరియానా దగ్గర ఆగింది. ఈ సందర్భంగా ‘మీరు ముద్దు పెట్టేటప్పుడు మీ పార్టనర్ ఎప్పుడైనా ఇంకా చాలు ఆపు.. అని అన్నారా?’ అనే ప్రశ్న అడిగారు.ఈ ప్రశ్నకు స్పందించిన అరియానా.. ‘ఇప్పుడు ఒకరి గురించి చెప్తే.. నేను కాదా అని ఇంకొకరు అనుకుంటారు.. ఇంకొకరి గురించి చెప్తే నేను కాదా..! అని వేరొకరు ఫీల్ అయిపోతారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ సమాధానం వినేసరికి అటు ప్రేక్షకులు ఇటు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అందరికీ దిమ్మ తిరిగిందని అంటున్నారు. అరియానాలో ఈ యాంగిల్ కూడా ఉందా.. ఇదెక్కడి మాస్ రా మావా.. అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అరియానా బోల్డ్ ఆన్సర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.