బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ విధానంతో హౌస్ లో కంటెంట్ బాగా క్రియేట్ అవుతోంది. 24 గంటల స్ట్రీమింగ్ గనుక కాస్త ఆసక్తిగా ఉండేలాగానే ప్లాన్ చేశారు. ప్రతి విషయంలో పోటీ, టాస్కులో పంతాలు హైలెట్ గా నిలుస్తున్నాయి. అలా ఈ షో రెండో వారం చివరికి చేరుకుంది. తొలివారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ హౌస్ వీడగా ఈ వారం మరొకరు బయటికి వెళ్లనున్నారు. ఇది ఇలా ఉండగా ఈ వారం ముఖ్య అతిథిగా స్టాండప్ రాహుల్ మూవీ హీరో హీరోయిన్లు రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ హౌస్ లోకి వెళ్లారు. ఈ సమమంలో అరియానాకు రాజ్ తరుణ్ మధ్య గొడవ జరిగింది.. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి అతిథులుగా వచ్చిన రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ హౌస్ మేట్స్ తో స్కిట్లు చేసి కడుపుబ్బా నవ్వించారు. అయితే ఇదే సమయంలో హౌస్ లోకి వచ్చిన రాజ్ తరుణ్ చేయి పట్టుకున్న అరియనా.. హౌస్ లోకి వచ్చాక హాయ్ చెప్పడానికి నీకెంటి అంత బలుపు అంటూ గొడవేసుకుంది. అరియనా మాటలకు మిగత హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాకయ్యారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే రాజ్‌తరుణ్ అనుభవించు రాజా సినిమాలో అరియానా కూడా నటించింది. ఈ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య చనువు పెరిగింది. ఆ చనువుతోనే నీకు హాయ్ చెప్పడానికి బలుపేంటి అంటూ నిలదీసింది. రాగానే చెప్పాను కదా అని రాజ్‌తరుణ్ అన్నప్పటికీ అరియానా మాత్రం శాంతించలేదు.
ఏంటి నీ ఫ్రెండ్ హాయ్ చెప్పట్లేదు అని చైతూ అప్పటినుంచి అంటున్నాడు అంటూ గరం గరం అయింది. వారి ముందు నా పరువు పోదా.. నీవు హాయి చెప్పకుంటే అని అరియానా అన్నది. అయితే వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్సే కాబట్టి ఇది సీరియస్ కాకపోవచ్చు.. బిగ్ బాస్ ప్రోమో కోసమే అలా చూపించి ఉంటాడని సినీ ప్రియులు అభిప్రాయపడుత చెప్పుకుంటున్నారు. మరి..ఈ ప్రోమోపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.