బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొదలైందో లేదో అప్పుడే వచ్చిన కంటెస్టెంట్స్ అంతా ఎవరికి వారు సొంత స్ట్రాటజీని స్టార్ట్ చేస్తున్నారు. అయితే.. వచ్చిరాగానే అందరి కంట్లో పడిన కంటెస్టెంట్ ఎవరంటే.. ఛాలెంజర్ టీమ్ యాంకర్ శివ. బిగ్ బాస్ లో గేమ్ ప్లే ఏమోగానీ లేడీ కంటెస్టెంట్ లతో పులిహోర విషయంలో మాత్రం చాలా చురుకుగా ఉన్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అందుకు సాక్ష్యాలుగా బిగ్ బాస్ ప్రోమోలలో సంభాషణలు కూడా వినిపిస్తున్నాయి. హౌస్ లో ఎక్కువ వారాలు ఉండాలంటే.. ఎవరో ఒకరితో లవ్ ట్రాక్ నడపాలి.. ఆ విధంగా హౌస్ లో నుండి బయటికి వచ్చేలోపు ఫేమ్ అయిపోవాలి అనే ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ లోనే శివ.. అరియానాతో పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు.హౌస్ లో ఇంతమంది అమ్మాయిలు ఉండగా.. ఫ్లర్ట్ చేసేందుకు నేనే దొరికానా? నాతో పులిహోర కలుపుతున్నావ్? అంటూ యాంకర్ శివని అరియానా అడిగింది. ‘అవును పడాలంటే.. ముందు పులిహోర కలపాలి కదా? అందుకే కలుపుతున్నా, ఇక నన్ను కాంట్రవర్సీ శివ అని కాకుండా పులిహోర శివ అని అంటారేమో’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీళ్ల సంభాషణలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక యాంకర్ శివ తనను ఫ్లర్ట్ చేస్తున్నాడని తెలిసి మెలికలు తిరిగిపోతోంది అరియానా. అలాగే యాంకర్ శివను మిత్రా శర్మ ‘అన్నా’ అని పిలవడంతో హర్ట్ అయ్యాడు. వచ్చీ రాగానే అన్నా అంటూ బాంబ్ పేల్చేశావ్ కదా? అంటూ ఆవేదన బయట పెట్టాడు. ఇక హౌస్ లో నామినేషన్స్ కూడా ఆసక్తి కరంగానే కనిపించాయి. మరి యాంకర్ శివ – అరియానా లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.