‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’ మూడు అరుపులు, ఆరు కేకలతో ఫుల్ జోష్ గా సాగిపోతోంది. ప్రతి విషయంలో గొడవలు పడటమే చూస్తారు. వాళ్లల్లో వాళ్లు బాగా కొట్టుకుని ప్రేక్షకులను మాత్రం బాగా ఎంటర్ టైన్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో పనుల విషయంలో, తిండి విషయంలో గొడవలు పడటం చూశారు. తాజాగా సిగిరెట్ల కోసం కొట్టుకు చస్తున్నారు. తేజస్వి- యాంకర్ శివ అయితే సిగిరెట్ల విషయంలో గొడవ కూడా పడ్డారు. నావి ఎందుకు పట్టుకున్నావ్ అంటూ తేజస్వి కేకలు వేస్తుంది.
అయితే తేజస్వి విషయంలో ఇరిటేట్ అయిన శివ సిగిరెట్ల కోసం నేరుగా బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చేశాడు. మధ్యలో బూతులు కూడా వాడేశాడు. సిగిరెట్లు నాకెందుకు రావడం లేదంటూ నిలదీశాడు. కెమెరా దగ్గరకు వెళ్లి మంచిగా పేరు రాసి తేజస్వి అని పంపుతున్నారు కదా? నాకెందుకు పంపరు. నా పేరు రాసి నా ముఖాన కూడా దెం**డి అన్నాడు. ఆ తర్వాత సారీ నా ముఖాన కొట్టండి అన్నాడు. సిగిరెట్ల కోసం ఎందుకురా ఇట్లా కొట్టుకుంటున్నారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. శివ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.