బిగ్ బాస్ తెలుగు ఓటీటీ బుల్లితెర ప్రేక్షకులను స్మార్ట్ ఫోన్లకు అంటుకుపోయేలా చేస్తోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను అలరిస్తున్నారు. రెండో వారం నగ్నం హీరోయిన్ శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యింది. ఎవ్వరినీ నిందించకుండా నవ్వుకుండా ఎంతో హ్యాపీగా శ్రీ రాపాక బిగ్ బాస్ హౌస్ ని వీడింది. ఆమె హుందాతన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హౌస్ లో ఎప్పుడూ ఏదొక టాస్కు నడుస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఒక్కొకళ్లు ఒకరి పేరు ఎంచుకుని వారికి బిగ్ బాస్ వాయిస్ లో వార్నింగ్ ఇవ్వాలంటూ టాస్క్ ఇచ్చారు.
ఇదీ చదవండి: హీరో రాజ్ తరుణ్ పై బోల్డ్ యాంకర్ అరియానా సీరియస్!
అందరూ ఒక్కొక్క పేరు తీసుకుని బిగ్ బాస్ స్టైల్ లో వారికి సూచనలు చేశారు. అయితే యాంకర్ శివ– బిందుకు చేసిన సూచనలు కాస్త కాంట్రవర్సీగా మారాయి. శివకు బిందు పేరు రాగానే అందరూ కేకలు వేశారు. నువ్వు చెప్పాలనుకున్నవి బిగ్ బాస్ చెప్పినట్లు చెప్పవచ్చంటూ కామెంట్ చేశారు. మహేశ్ విట్టా అయితే బిందు మాకు మీకు ప్యార్ చేస్తోంది అన్నాడు. శివ మాట్లాడుతూ కొన్ని ఫన్నీగా మాట్లాడాడు. ఆ తర్వాత ఎక్కువగా శివతో తిరుగు, శివతో మాట్లాడు, శివతోనే ఉండు అంటూ చెప్పుకొచ్చాడు. ఇంట్లోని సభ్యులు కామెంట్ చేయడం కాస్త చర్చకు తావిస్తోంది. బిందు శివను బ్రదర్ అనిపిలవడం.. మనోడేమో కాదుకాదు అనడం చూస్తూనే ఉన్నాం. మూడో వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.