‘బిగ్ బాస్ ఓటీటీ’కి కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభిస్తోంది. ఈసారి కాన్సెప్ట్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఛాలెంజర్స్ Vs వారియర్స్ అంటూ ప్రేక్షకులను గట్టిగానే ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ లో పాల్గొన్న వారిని తీసుకురావడం. కొత్త వారితో పోటీ పెట్టడం. ప్రతి టాస్కు ఇద్దరికీ పెడుతుండటం అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ బిగ్ బాస్ ఓటీటీకి కూడా నాగార్జునానే హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
మొదట్లో ఈ షోకి ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడని చెప్పుకొన్నారు. కానీ, ఆ రూమర్స్ ను క్లియర్ చేస్తూ కింగ్ నాగార్జున హోస్ట్ గా పరిచయం అయ్యాడు. బిగ్ బాస్ ను నాగార్జునను విడిగా చూడలేం అనేంతగా నాగార్జున బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైంది. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కోసం నాగార్జున ఎంత పారితోషకం తీసుకుంటున్నాడు అని. దానికి సంబంధించి చాలానే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సీజన్ లో నాగార్జున వారానికి ఒక ఎపిసోడ్ మాత్రమే వస్తాడు. కాబట్టి రెమ్యూనరేషన్ తక్కువగా ఉంటుంది అనుకున్నారు. కానీ, అలాంటి ఆలోచనలకు చెక్ చెప్తూ రెమ్యూనరేషన్ విషయంలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ సీజన్ కు నాగార్జున దాదాపు రూ.9 కోట్లు దాకా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయనకున్న క్రేజ్, ఆ ఎనర్జీకి ఎంత ఇచ్చినా తక్కువే అంటూ అభిమానులు చెబుతున్నారు. నాగార్జున రెమ్యూనరేషన్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.