బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 అట్టహాసంగా ముగిసినట్లు తెలుస్తోంది. నిజానికి మే 21న సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. కాకపోతే అది లైవ్ కాదులెండి.. ఇప్పటికే రికార్డు చేసిన ఫీడ్ ను ఆ సమయంలో టెలికాస్ట్ చేస్తారు. ఈసారి గ్రాండ్ ఫినాలేకి ఎవరూ అతిథిగా రావడం లేదని తెలుస్తోంది. కింగ్ నాగార్జునానే ట్రోఫీని అందజేస్తారు. బిందు మాధవి టైటిల్ విన్నర్ అని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె స్టేజ్ పై ఇచ్చిన విన్నింగ్ స్పీచ్ గురించి కూడా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అయితే ఈసారి కుడా అఖిల్ సార్థక్ రన్నర్ గా నిలిచాడని వస్తున్న వార్తలను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
అఖిల్ కు ఈసారి కూడా అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో అతని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిజానికి అఖిల్ బిగ్ బాస్ సీజన్ 4 విజేత కావాల్సిందని వారి అభిప్రాయం. కానీ, అప్పట్లో అఖిల్ కి అన్యాయం చేసి అభిజిత్ ను విన్నర్ చేశారంటూ ఇప్పటికీ అఖిల్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే అఖిల్ బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కంటెస్టెంట్ అని తెలియగానే ఫ్యాన్స్ అప్పుడే ఈసారి టైటిల్ విన్నర్ అఖిల్ అని ఫిక్స్ అయిపోయారు.
కానీ, ఈసారి కూడా అఖిల్ రన్నర్ గా నిలిచాడు అని తెలియడంతో సామాజిక మాధ్యమాల్లో బిగ్ బాస్ నిర్వాహకులపై గుర్రుగా ఉన్నారు. ప్రతిసారి అఖిల్ కి అన్యాయం చేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. గేమ్ పరంగా అందరికంటే అఖిల్ ది బెస్ట్ అంటూ చెబుతున్నారు. ఎన్ని అవమానాలు చేసినా, అతనిపై గేమ్ లో ఎన్ని కుట్రలు చేసినా అఖిల్ ఎదిరించి ఒక జెంటిల్ మన్ లా గేమ్ ఆడాడని ఫ్యాన్స్ కితాబు ఇస్తున్నారు. అలాంటిది నిర్వాహకులు కావాలనే అఖిల్ కి అన్యాయం చేశారంటూ చెబుతున్నారు.
బిగ్ బాస్ నిర్వహకులపై ఎప్పటి నుంచో ఒక అపవాదు ఉంది. ఎప్పుడూ టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఆడవాళ్లకు ఇవ్వరు అని మొదటి నుంచి ప్రేక్షకుల్లో నెగెటివ్ ఫీలింగ్ ఉంది. ఈసారి ఇంట్లోని సభ్యులు కూడా ఈసారి టైటిల్ విన్నర్ ఆడవాళ్లే కావాలంటూ బాహాటంగానే కామెంట్ చేశారు. అందుకే ఈసారి ఆ అపవాదును తప్పించుకోవడానికే బిందు మాధవికి అవకాశం కల్పించారంటూ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
అఖిల్ కు కావాలనే అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ గా తమ వరకు మాత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 4, బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండుసార్లు అఖిలే టైటిల్ విన్నర్ అంటూ చెబుతున్నారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అఖిల్ సార్థక్ కు అన్యాయం జరిగిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.