బిగ్ బాస్ తెలుగు ఓటీటీ బాగానే అలరిస్తోంది. ప్రేక్షకులు ఫోన్లకు పరిమితమైపోతున్నారు. ముఖ్యంగా టాస్కుల్లో ఇంట్లోని సభ్యులు తెగ కొట్టేసుకుంటున్నారు. గ్రూపులతో ప్రతి విషయానికి టాస్కులే పెట్టాల్సి వస్తోంది. నాలుగు వారాలకే ఇంట్లో వాతావరణం వేడెక్కింది. నాలుగోవారం ఎవరు ఇంట్లో నుంచి ఎలిమినేట్ కాబోతున్నారు అనేదే ప్రశ్న. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం.
ఇదీ చదవండి: బిందు మాధవిపై సీనియర్లు సీరియస్! గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లున్నారు?
నాలుగో వారం నామినేషన్స్ లో అరియానా, సరయు, అజయ్, బిందు మాధవి, అనీల్ రాథోడ్, యాంకర్ శివ, మిత్రా శర్మ ఉన్నారు. ఓటింగ్ పరంగా చూసుకుంటే అరియానా, బిందు మాధవి, యాంకర్ శివ సేఫ్ అనే చెప్పాలి. వారు కచ్చితంగా సేఫ్ జోన్ లోనే ఉంటారు. ఇటు సరయు, అనీల్ రాథోడ్, అజయ్, మిత్రా శర్మాల్లో అజయ్ టాస్కుల్లో సూపర్ అనిపించుకుంటున్నాడు, కాస్తో కూస్తో అఖిల్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అజయ్ కి దిగులు లేదు. ఇంక అనీల్ రాథోడ్, సరయు, మిత్రా శర్మ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే లాస్ట్ టూ వీక్స్ నుంచి మిత్రా శర్మ టాస్కుల్లో యాక్టివ్ గా ఉండటం వల్ల ఓట్లు పెరిగే అవకాశం లేకపోలేదు.
ఇంక అనీల్ రాథోడ్, సరయు విషయం తీసుకుంటే సరయునే తప్పుకుండా ఎడ్జ్ లో ఉందని చెప్పాలి. పైగా కెప్టెన్సీ టాస్కులో తన గురించి కాకుండా మహేశ్ నాకోసం త్యాగం చేశాడు అంటూ మాట్లాడింది. ఆ సమయంలో సరయు ఏం చెప్పాలనుకుంటుందో కూడా అర్థంకావట్లేదు అని కామెంట్ చేశారు. అది కూడా సరయుని నెగెటివ్ చేసిన అంశం. భాష కూడా సరయుకు కాస్త ఇబ్బందిగా మారింది. ఆమె ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడుతుండటంతో ప్రేక్షకులకు అర్థంకాని పరిస్థితి ఉంది. అనీల్ విషయానికి వస్తే అపోజిట్ సరయు కాబట్టి అదే మనోడికి ప్లస్ అయ్యే అంశం. ఏదైమైనా ఈ వారం సరయు ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయట టాక్ ప్రకారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే అనీల్ కూడా వెళ్లిపోయే అవకాశం ఉంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.