బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్‌లో గలాటా చేసిన సభ్యులు మొత్తం మరోసారి ఒకే స్టేజ్‌పై కలిశారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన వారంతా ఆదివారం విత్ స్టార్ మా పరివార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత మంది హౌస్‌లో చేసిన రచ్చ కంటే.. ఈ ప్రోగ్రామ్‌లో ఇంకా రెచ్చిపోయి గలాటా చేశారు. గలాటా గీతూ, సూర్య, వాసంతి, అర్జున్ కల్యాణ్, చలాకీ చంటి, నేహా చౌదరి ఇలా అందరూ ఎన్నో ఆటలు ఆడుతూ.. ప్రేక్షకులను అలరించారు. అందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. అయితే ఈ ప్రోమోలో కొన్ని ఎలివేషన్లు బిగ్ బాస్ హౌస్‌ని గుర్తుచేస్తే.. ఇంకొన్ని మాత్రం బిగ్ బాస్ హౌస్‌లో చూసిన దానకి పూర్తి భిన్నంగా కనిపించాయి.
అవేంటంటే.. ఈ ప్రోమోలో కూడా ఆర్జే సూర్య- ఆరోహీ రావ్‌లది ఫ్రెండ్షిప్ అని చెబుతూనే బీజీఎంలు వేశారు. కష్టమైనా, సుఖమైనా కలిసే పంచుకుంటాం. ఇది కూడా కలిసే తాగుదాం అంటూ కాకరకాయ జ్యూస్ సగం తాగి.. సగం సూర్యకి ఇస్తుంది ఆరోహి రావ్. అది తాగిన తర్వాత ఇద్దరూ ఒకరిని ఒకరు పట్టుకుని ఒక పోజ్ ఇస్తే.. అది చూసి ప్రేక్షకులతో పాటుగా బిగ్ బాస్ సభ్యులు కూడా నోరెళ్లబెట్టారు. ఆ విషయం పక్కనపెడితే.. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. అదేంటంటే.. వాసంతి- అర్జున్ కల్యాణ్‌ను గట్టిగా పట్టుకుని బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. ఎంత గట్టిగా అంటే.. ఆమె పెదాల గుర్తు ఒక టాటూలా అర్జున్ బుగ్గపై పడిపోయింది. ఈ ఊహించని పరిణామం చూసి చలాకీ చంటిలాంటి వాళ్లు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఒక గేమ్ ఆడారు. అందులో కాకరకాయ జ్యూస్ తాగాల్సి ఉంటుంది. అయితే వాసంతి ఒక షాట్ కరేలా జ్యూస్ తాగాల్సి వచ్చింది. అందుకు ఆ గ్లాస్ పట్టుకుని అర్జున్ నా కోసం తాగుతావా అని అడుగుతుంది. మనోడు కదలకుండా ఉండిపోయాడు. అందుకు శ్రీసత్య అడిగితే తాగుతావు కదా అంటూ అనేసింది. ఇంక చేసేది లేక అర్జున్ కల్యాణ్ వెళ్లి ఆ జ్యూస్ తాగాడు. ఇంక అర్జున్ కల్యాణ్‌ని పట్టుకుని బుగ్గ మీద టాటూ వేసేసింది. ఆమె ముద్దుపెట్టిన తర్వాత సూర్యా వచ్చి బిగ్ బాస్.. టాటూకంటే చాలా గొప్పది అంటూ చెప్పుకొచ్చాడు. ఇది చూసిన తర్వాత ప్రేక్షకులు మరి శ్రీసత్య సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. బయటకి వచ్చేసిన తర్వాత మీరిద్దరు కనెక్ట్ అయిపోయారా అంటూ డౌటనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వాసంతి ముద్దువ్విడం అనేది కాస్త షాకింగ్‌గానే ఉంది మరి.