బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మరికొన్ని రోజుల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన తేదీని ప్రకటిస్తూ ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ రియాలిటీ షో ఆరో సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జునానే వ్యవహరించనున్నాడు. ఈ సీజన్లో ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. మళ్లీ కామన్ కేటగిరీలో ఒకరు లేదా ఇద్దరిని హౌస్‌లోకి పంపనున్నారు.
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఇంట్లోకి వెళ్లే సభ్యులు క్వారంటైన్ కు కూడా వెళ్లారంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే సభ్యులు వీళ్లే అంటూ కొన్ని పేర్లు, ఓ జాబితా కూడా వైరల్ అవుతోంది. అయితే బిగ్ బాస్‌లో స్టేజ్ మీద అడుగు పెట్టే వరకు కూడా ఎవరు లోపలికి వెళ్తారు అనేది చెప్పలేం. కానీ, కొందరు ఇచ్చే లీకుల పుణ్యమాని కొన్ని పేర్లు మాత్రం బయటకు వస్తుంటాయి. కానీ, వాళ్లు కూడా ఫైనల్ అవుతారని ఎలాంటి గ్యారెంటీ ఉండదు.
ఇప్పటికే శ్రీహాన్, జబర్దస్త్ చలాకీ చంటి, యూట్యూబర్ ఆదిరెడ్డి, గలాటా గీతూ, ఇస్మార్ట్ అంజలి వంటి వారి పేర్లు దాదాపు ఖరారు అంటూ వార్తలు వస్తున్న మాట తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టుకు మరో పేరు యాడ్ అయ్యింది. టాలీవుడ్‌కు చెందిన ఓ హీరో కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో సభ్యుడు కాబోతున్నాడని చెబుతున్నారు. ఒకప్పటి స్టార్ హీరో ఇప్పుడు హౌస్‌లోకి రాబోతున్నాడని చెప్పగానే ప్రేక్షకులు ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత టాలీవుడ్‌లో హీరోగా చేసి ప్రస్తుతం టీవీ సీరియల్స్ రాణిస్తున్న బాలాదిత్య.. బిగ్ బాస్‌కు వెళ్లనున్నట్లు చెబుతున్నారు. అదే నిజమైతే బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్ కూడా బాలాదిత్యానే అవుతాడంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఇదంతా ఎంతవరకు నిజం.. నిజంగానే బాలాదిత్య హౌస్‌లోకి వెళ్తాడా అంటే సెప్టెంబర్ 4నే క్లారిటీ వస్తుంది. బాలాదిత్య బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెడితే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.