బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మళ్లీ ఫుల్ జోష్ అందుకున్నట్లుగానే కనిపిస్తోంది. నాగార్జున పీకిన క్లాసు గట్టిగానే ఉపయోగపడింది. రెండోవారం అందరికీ షాకిస్తూ.. డబుల్ ఎలిమినేషన్ చేశారు. శనివారం షానీ సాల్మన్, ఆదివారం అభినయశ్రీలను ఎలిమినేట్ చేశారు. డబుల్ ఎలిమినేషన్ తో అంతా షాక్లో ఉండగానే మళ్లీ నామినేషన్స్ రానే వచ్చాయి. నామినేషన్స్ లో మిగిలిన రెండు వారాల కంటే ఎక్కువ రచ్చ జరిగినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చిల్ అవ్వడానికి మేము రాలేదు అని నిరూపించుకోవడానికి చాలా గట్టిగానే కృషి చేస్తున్నారు. అంతా నామినేట్ చేయడం గానీ.. అందుకు వాళ్లు చెప్పే రీజన్స్, వాటిని ఎదుటివాళ్లు అపోజ్ చేయడం అంతా చూస్తే యుద్ధ వాతావరణమే కనిపించింది.
ఈ వారం నామినేషన్స్ లో ఎవరు ఉండబోతున్నారు అనే లెక్క తీసుకుంటే 9 మంది ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. నామినేషన్స్ లిస్ట్ 9 నుంచి 11 వరకు పోయే అవకాశం కూడా ఉంది. బిగ్ బాస్ నామినేషన్ సమయంలో మీరు ఎవరికీ భయపడకుండా మీరు అనుకున్నది చెప్పేందుకు బిగ్ బాస్ మీకు అవకాశం ఇస్తున్నారు అంటూ ఇంట్లోని సభ్యులను చెప్పకనే చెప్పాడు కొట్టేసుకోమని. అది విన్న వాళ్లంతా ఊగిపోయారు. ఒక ప్లేట్ లో ఎర్ర రంగు పెట్టి మీరు నామినేట్ చేసే వారి ముఖాని ఆ రంగు పూసి సరైన కారణం చెప్పండని బిగ్ బాస్ కోరాడు. ఇంక ఇంట్లోని సభ్యులు మొత్తం వారి వారి కారణాలు చెప్పుకుని కొట్టేసుకున్నారు.
ఈవారం నామినేషన్స్ లోనూ కొన్ని పేర్లు కామన్‌గా వినిపించాయి. అవేంటంటే సింగర్ రేవంత్, గీతూ రాయల్. వీళ్లు బిగ్ బాస్ మొదటి వారం నుంచీ మూడువారాలు నామినేషన్స్ లో ఉన్నారు. ఈసారి కూడా గీతూ రాయల్‌ని చాలా మందే నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇనయా ఈ వారం కూడా గీతూని నామినేట్ చేసింది. మొత్తం నామినేషన్స్ లో ఉన్న వాళ్ల పేర్లు చూస్తే.. సింగర్ రేవంత్, గీతూ రాయల్, సుదీపా పింకీ, చంటి, వాసంతి కృష్ణన్, ఆదిరెడ్డి, అర్జున్ కల్యాణ్, ఇనయా సుల్తానా, ఆరోహీ రావు నామినేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లు కాక బాలాదిత్య, శ్రీహాన్ కూడా నామినేషన్స్ లో ఉండే అవకాశం ఉందని సమాచారం. అంటే ఈవారం మొత్తం 9 నుంచి 11 మంది నామినేషన్స్ లో ఉండే అవకాశం ఉంది. ఈ వారం నామినేషన్స్ లిస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.