మంగళంపల్లి శ్రీసత్య.. ఈమె పేరు దాదాపుగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు ఆ తర్వాత యాక్టింగ్ స్టార్ట్ చేసింది. చాలా షార్ట్ ఫిలింస్ లో నటిచింది. సినిమాల్లోనూ నటించినా.. సీరియల్స్ తోనే ఆమెకు ఎక్కువ గుర్తింపు అనేది వచ్చింది. ముద్ద మద్దారం, త్రినయని వంటి సీరియల్స్ తో ఎంతో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఆరో సభ్యురాలిగా హౌస్ లో అడుగుపెట్టింది. స్టేజ్ మీదే ఐ యామ్ సింగిల్, రెడీ టు మింగిల్ అంటూ రచ్చ షురూ చేసింది. ఆమెను చూడగానే అంతా బిగ్ బాస్ ఇంట్లో మోనాల్ తర్వాత అంతకు మించిన ఒక బబ్లీ బ్యూటీ అడుగుపెట్టింది అంటూ కామెంట్ చేశారు.
ఈమె గేమ్ లో దూసుకుపోతుందంటూ అంతా అంచనాలు వేశారు. అయితే ఆమె అందరి అంచనాలను తలకిందులు చేసింది. అసలు పార్టిసిపేట్ చేయడం, అందరితో కలిసి పోవడం చేయలేదు. అందరికీ దూరంగా ఉంటూ, ఎవరితో మాట్లాడకుండా డిస్టెన్స్ లో ఉంటూ వస్తోంది. అయితే తొలివారం నామినేషన్స్ లో అందరూ ఇవే అంశాలను చెబుతూ శ్రీసత్యను నామినేట్ చేయడం ప్రారంభించారు. మాట్లాడించినా మాట్లాడదని, పిలిచినా పట్టించుకోదని చెప్పుకొచ్చారు. ఆరోహి అయితే అసలు ఆమె ఇంతవరకు నా పేరు కూడా పలకలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు యాటిట్యూడ్ అంటూ అందరూ స్టాంప్ వేశారు.
అయితే ఆ తర్వాత శ్రీ సత్య మాట్లాడుతూ అందరూ కనిపించేదే నిజం అని నమ్ముతారు. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల తాను అందరికీ దూరంగా ఉంటున్నానంటూ శ్రీ సత్య క్లారిటీ ఇచ్చింది. అయితే ఏం జరిగింది? ఎందుకు ఆమె అలా ఉంటోంది అనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియదు. దాదాపు తాను అందరితో కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. నామినేషన్స్ లో మాత్రం ఇంట్లోని సభ్యులు అందరూ శ్రీ సత్య అంటే యాటిట్యూడ్ పర్సన్ అని ఫిక్స్ అయిపోయారు. తాజాగా అందరితో మాట్లాడుతూ శ్రీ సత్య తన జీవితంలో జరిగిన విషాద ఘటనలను పంచుకుంది. అసలు ఆమె ఎందుకు అలా ఉంది? ఆమె ఎందుకు మనుషులతో కలవలేకపోతోంది అనే అంశాలను వివరించింది.