బిగ్ బాస్ 6వ సీజన్ లో హీట్ పెరిగింది. మూడోవారం నామినేషన్స్ లో హౌస్ సభ్యులు రచ్చ రచ్చ చేశారు. గత రెండువారాలు షోని పెద్దగా పట్టించుకోని ఆడియెన్స్ కూడా సోమవారం టీవీ ముందు కూర్చొన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు కేకలు వేసుకుని.. వేరొకరిని నామినేట్ చేయడం కంటే ఆ గొడవలు తెగ ఆసక్తి కలిగించాయి. ఇక ఈ నామినేషన్స్ కంటే ముందు జైలులో ఉన్న శ్రీసత్య.. బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ వారం ఇనయా, ఆరోహిలని నామినేట్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బబ్లీ బ్యూటీ శ్రీసత్య బిగ్ బాస్ హౌసులోకి వచ్చినప్పటి నుంచి కాస్త నిర్లక్ష్యంగా ఉన్నట్లే కనిపించింది. సిసింద్రీ టాస్కులోని తన బొమ్మ తీసుకున్నా సరే.. పోతేపోనీ అన్నట్లు వ్యవహరించింది. ఈ విషయమై తాజాగా జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లోనూ నాగార్జున గట్టిగా ఆడేసుకున్నారు. నువ్వు ఆడటానికి వచ్చావా, తినడానికి వచ్చావా అని గట్టిగా క్లాస్ పీకారు. దీంతో పాటు గతవారం వరస్ట్ ఫెర్ఫామర్ గా అందరూ శ్రీసత్యనే నామినేట్ చేశారు. దీంతో ఆమెని జైల్లో పెట్టారు.
ఇక జైల్లో ఉన్న శ్రీసత్యతో అర్జున్ విజయ్ పులిహోర కలుపుతూ కనిపించాడు. ఆమె జైలులో ఉంటే మనోడు బయట పడిగాపులు కాస్తూ కనిపించాడు. ఆ తర్వాత తన గురించి గీతూతో మాట్లాడిన శ్రీసత్య.. ‘నాలో ఉన్న నెగిటివ్స్ ఏంటి.. ఏం సర్దిచేసుకోవాలి’ అని అడిగింది. ఓవర్ అగ్రిసివ్ అయిపోతున్నావ్ అని గీతూ సమాధానం చెప్పింది. అయితే అగ్రిసివ్ గురించి, ప్రవర్తన గురించి, మైండ్ సెట్ గురించి సలహాలు చెప్పడం జోక్ ఆఫ్ ది డే అని శ్రీసత్య చెప్పింది. గీతూతోనే మాట్లాడుతూ.. తను ఇక్కడికి డబ్బు కోసమే వచ్చానని కుండబద్దలు కొట్టేసింది. అందుకే నన్ను నేను మార్చుకోలేనని కూడా క్లారిటీ ఇచ్చేసింది. మరి శ్రీసత్య వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: శ్రీ సత్య ఉగ్రరూపం.. ఇనయా సుల్తానాపై కేకలు వేస్తూ..!