బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్ మొత్తం గరం గరం అయిపోతోంది. కెప్టెన్సీ కోసం తెగ పోరాడుతున్నారు. అయితే మొదట ఆదిరెడ్డి, మెరీనా, రోహిత్, శ్రీసత్య, ఫైమా, కీర్తీ కెప్టెన్టీ కంటెండర్లు అయ్యారు. మొదట శ్రీహాన్‌కు అవకాశం రాగా.. దానిని ఎవరికి ఇస్తారు అంటే రేవంత్‌కి దెబ్బేసి శ్రీసత్యకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఆరుగురిలో చివరికి ఆదిరెడ్డి, శ్రీసత్య, ఫైమా మిగులుతారు. వారిలో నుంచి ఆదిరెడ్డి- శ్రీసత్యను గేమ్ లో నుంచి ఎలిమినేట్ చేస్తాడు. ఈ విషయంలో వారి మధ్య కాస్త గొడవ కూడా జరిగింది. నేను ఫైమాతో కుమ్మక్కై గేమ్ ఆడుతున్న అని నిరూపిస్తూ తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్లిపోతా అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే ఇదే గేమ్‌లో తొలుత ఒక ఇంట్రస్టింగ్ విషయం ఒకటి జరిగింది. ఆదిరెడ్డి శ్రీసత్య బ్యాగ్‌లో నుంచి బాల్స్ ని బయట పడేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆమె ఆదిరెడ్డి చేతికి ముద్దులు పెడుతూ నానా యాగి చేసింది. ఆదిరెడ్డి కూడా ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి అంటూ కామెంట్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియో శ్రీసత్యకు చాలా నెగెటివ్ అవుతోంది. ఆమె వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. గేమ్‌లో విన్ అవ్వడానికి అంతలా దిగజారి ప్రవర్తించాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. శ్రీసత్య చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటూ గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు.
ఎందుకు అంతలా విమర్శిస్తున్నారు అంటే.. శ్రీసత్య గతంలో హౌస్‌లో అర్జున్ కల్యాణ్ ఉన్నప్పుడు కొన్ని కామెంట్స్ చేసింది. అర్జున్ జైలులోల ఉన్నప్పుడు శ్రీసత్య అక్కడ కూర్చుంటుంది. ఏదో చెప్తూ ఆమె ఎమోషనల్ అయితే ఓదార్చేందుకు చేతి మీద అర్జున్ కల్యాణ్ తడతాడు. దానిని ఆమె చాలా పెద్ద సీన్ చేసింది. అసలు అలా ఎలా పట్టుకుంటావ్? నన్ను ఎలా టచ్ చేస్తావ్? నాకు అస్సలు నచ్చదు అంటూ చాలా సీరియస్ అయ్యింది. అయితే అప్పుడు అందరికీ అర్థం కాలేదు. అర్జున్ కల్యాణ్ ఒక్కడు టచ్ చేస్తేనే కోపం అనుకుంట అని. ఎందుకంటే ఆ తర్వాత ఆమె శ్రీహాన్‌తో క్లోజ్‌గా ఉండటం, చేతులు పట్టుకుని కూర్చోవడం, హగ్ చేసుకోవడం అన్నీ చూస్తూనే ఉన్నాం.
ఇంకో కోణంలో కూడా శ్రీసత్యపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదేంటంటే.. ఒకప్పుడు ఇనయాని ముద్దులు పెట్టుకున్నారు, హగ్ చేసుకున్నారు అని కామెంట్స్ చేసి తీరా అడిగితే నేనెప్పుడు అన్నాను అంటూ తప్పించుకోవడం చూశాం. ఇప్పుడు ఆమె చేస్తోంది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. టచ్ చేసినా ఇష్టంలేదు, అది నా క్యారెక్టర్ అంటూ చెప్పిన శ్రీసత్య.. ఇప్పుడు ఆదిరెడ్డి చేతికి ముద్దులు ఎలా పెడుతుందని ప్రశ్నిస్తున్నారు. అంటే గెలిచేందుకు అంత దిగజారిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ కాకపోయుంటే గత వారమే ఎలిమినేట్ అయ్యేదంటూ కామెంట్ చేస్తున్నారు. హౌస్‌లో ఇప్పుడిప్పుడే అసలు రంగులు బయట పడుతున్నాయంటూ చెబుతున్నారు.
Entra babu e #srisatya 🤮🤮🤮#BiggBossTelugu #biggbosstelugu6 #BiggBoss #adireddy pic.twitter.com/UpuqZnC69J
— THAGGEDHE LE (@kannababuga) November 10, 2022