Sri Sathya: బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘శ్రీ సత్య’. సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లు అంటూ ఈ అమ్మడు అన్ని చోట్లా తన సత్తా చాటింది. తీరికలేని బిజీతో ముందుకు దూసుకోపోతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ సీజన్ 6కు ఎంపికైంది. ఆరో సభ్యురాలిగా శ్రీ సత్య బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఇక, శ్రీ సత్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆమె పూర్తి పేరు మంగళంపల్లి శ్రీ సత్య. 1997 జూన్ 29న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించింది.
శ్రీ సత్య తండ్రి పేరు దుర్గా శ్రీనివాస ప్రసాద్, తల్లిపేరు లలిత. సత్యకు ఓ సోదరి, సోదరుడు ఉన్నారు. నటన మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. 2015లో మిస్ విజయవాడ కిరీటాన్ని సొంతం చేసుకుంది. 2016లో నేను శైలజా సినిమాలో హీరో మాజీ లవర్‌గా కనిపించింది. శ్రీ సత్య చాలా షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించింది. తరుణం, అంతా భ్రాంతియేనా, లవ్‌స్కెచ్, రౌడీ గర్ల్ ఫ్రెండ్ మొదలైన వాటిలో నటించింది. అంతేకాదు! ‘తొందరపడుకు సుందర వదనా’ అనే వెబ్ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకుంది.
నిన్నే పెళ్లాడతాతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించింది. శ్రీ సత్య ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ చూపదు. మోగా, జిమ్, స్విమ్మింగ్ చేస్తుంటుంది. ఈ అమ్మాయికి జంతువులంటే చాలా ఇష్టం. కుక్కల్ని ఎంతో ఇష్టం పెంచుకుంటోంది. డ్యాన్సింగ్ అన్నా ట్రావెలింగ్ అన్నా ఈమెకు ఎంతో ఇష్టం. నటనలో తనను తాను నిరూపించుకున్న శ్రీ సత్య ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 6లోకి అడుగుపెట్టింది. మరి, శ్రీ సత్య బిగ్ బాస్ హౌస్‌లో అందరికీ పోటీగా నిలిచి విన్నర్ అవుతుందా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.