బిగ్ బాస్ ఆరో సీజన్. మెల్లమెల్లగా ట్రాక్ పైకి వస్తున్నట్లు అనిపిస్తోంది. తొలివారం అలా సరదాగా సాగిపోయింది. కానీ రెండో వారం మాత్రం హీట్ పెరిగిపోయింది. నామినేషన్స్ లో ఒకరి గురించి ఒకరు చెబుతూ.. గొడవ గొడవ చేశారు. దీంతో తొలివారం ఉన్న బాండింగ్ కాస్త రెండోవారానికి తగ్గింది. ఎవరికి వారు మెల్లగా ఓపెన్ అవుతున్నారు. శ్రీసత్య కూడా టచ్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అర్జున్ కల్యాణ్, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్ సోఫాలో కూర్చుని మార్నింగ్ డిస్కసన్ పెట్టుకున్నారు. ఈ సమయంలో తనపై అస్సలు జోకులు వేయొద్దని అర్జున్, రేవంత్ కి స్ట్రిక్ట్ గా చెప్పేశాడు.
శ్రీసత్య, కీర్తి.. తనకు చెల్లెళ్లు అని రేవంత్ అనేసరికి అర్జున్ కల్యాణ్ తీసుకోలేకపోయాడు. అలా పిలవొద్దన్నట్లు చెబుతూ రేవంత్ తో చాలాసేపు గొడవపడి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. ఇక్కడ ఓ కామెంట్ చేసిన శ్రీసత్య.. హౌసులో ఎవరైనా సరే తనకు అన్నయ్యలే అని చెప్పింది. ఈ సమయంలో శ్రీసత్యతో మాట్లాడిన శ్రీహాన్.. ఉదయం నిన్ను టచ్ చేసినప్పుడు ఫీలయ్యావ్ కదా అందుకే అర్జున్ వెళ్లిపోయాడని అన్నాడు. దీనికి సీరియస్ గా రెస్పాండ్ అయిన శ్రీసత్య.. ‘నన్ను టచ్ చేస్తే నాకు ప్రాబ్లమ్. నాకు నచ్చినవాళ్లయితే ఓకే గానీ, ఎవరు పడితే వాళ్లు నా ఒంటిమీద చేయివేస్తే నచ్చు. భుజంపై ఫ్రెండ్స్ లా, సైడ్ హగ్ వరకు ఓకే.. అది కూడా నేను కంఫర్ట్ గా ఫీలైతేనే లేదంటే అస్సలు నచ్చదు’ అని చెప్పిసేంది.
శ్రీసత్య మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ తలో రకంగా స్పందిస్తున్నారు. బిగ్ బాస్ హౌసులో టచ్ చేయొద్దంటే ఎలా? రేప్పొద్దున టాస్కులు ఆడేటప్పుడు ఒకరిపై ఒకరు దొర్లాల్సి వస్తుంది కదా. మరి అప్పుడేం చేస్తావ్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వారం హౌసులోని ఏడుగురు ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. వారిలో రాజశేఖర్, షానీ, అభినయ శ్రీ, ఫైమా, రోహిత్-మెరీనా, ఆదిరెడ్డి, గీతూ, రేవంత్ ఉన్నారు. మరి శ్రీసత్య టచ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: గీతూ రాయల్‌పై విరుచుకుపడిన ఆర్జే సూర్య.. అక్కడ ఎలా చేయి పెట్టాలి అంటూ..!