బిగ్ బాస్ అంటే చాలామంది గొడవలు, తిట్టుకోవడం లాంటివే చూస్తారు. కానీ కొందరు మాత్రం హౌసులో అమ్మాయిలు ఎవరెవరు బాగున్నారు. ఏ మాత్రం గ్లామర్ షో చేస్తున్నారు లాంటివి గమనిస్తుంటారు. అందుకు తగ్గట్లే బిగ్ బాస్ ప్రతి సీజన్ లోనూ మంచి మంచి గ్లామర్ బ్యూటీస్ ని తీసుకొస్తుంటాడు. ఈసారి వచ్చిన కంటెస్టెంట్లలో శ్రీసత్య అలాంటి బ్యూటీనే. కాకుంటే శ్రీసత్య బిగ్ బాస్ హౌస్ కు కప్ కొట్టడానికి రాలేదు.. తినడానికి మాత్రమే వచ్చింది. బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికీ ఇది ఈపాటికే అర్థమయ్యుంటుంది. ఇదంతా పక్కనపెడితే తాజాగా ఈ అమ్మడు, తాను పెద్దమనిషి అయినప్పుడు జరిగిన పర్సనల్ విషయాలను సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ తో చెప్పుకొచ్చింది.
శ్రీహాన్ కెప్టెన్ అయినప్పటి నుంచి శ్రీసత్య బిల్డప్ మామూలుగా ఉండట్లేదు. ఈమె కెప్టెన్‌లా ఫీల్ అయిపోతుంది. ఇక మనోడు అసలే ఊరుకోవట్లేదు. శ్రీసత్య ఎంత చెప్తే అంత అన్నట్టుగా పని కానిచ్చేస్తున్నాడు. ఇక వీళ్లిద్దరూ స్విమ్మింగ్ పూల్ దగ్గర పడుకుని పెట్టిన ముచ్చట్లు మామూలుగా లేవు. ఈ క్రమంలో శ్రీ సత్య, తాను పెద్ద మనిషి అయినప్పటి ముచ్చట్లు శ్రీ హాన్‌తో చెప్పుకొచ్చింది. ఇంటి దగ్గర గుడ్లు ఎక్కువ తింటానని.. అది అవ్వగానే పనమ్మాయి.. అమ్మాయిగారూ చికెన్ తెచ్చుకుంటారా? అని అడుగుతుందంట. హా తెస్తా ఉండు అని వెళ్లి చికెన్ తెచ్చుకుని తినేస్తదట. ఈ సోది మొత్తం శ్రీహాన్‌కి చెప్తే.. మనోడు దాన్ని ఎలా వండాలో.. ఎలా తినాలో చెప్తాడు. ఇది చాలదన్నట్లు.. శ్రీసత్య తన పెద్ద మనిషి అయినప్పటి మ్యాటర్ మన పులిహోర రాజాతో చెప్పుకొచ్చింది.
శ్రీసత్య పెద్ద మనిషి అయినప్పుడు వాళ్ల నాన్న ఓనీ ఫంక్షన్ చేయలేదట. అప్పుడు వాళ్ల నాన్న ఈమె దగ్గరకు వచ్చి.. సత్య ఏం కావాలమ్మా అని అడిగాడట. ఈ పాప బంగారం, డ్రెస్సులు అడగలేదట. నాకు ఏమొద్దు డాడీ.. రోజూ చికెన్ తీసుకుని రా అని అడిగిందట. ఈ మాట శ్రీహాన్‌తో చెప్పి తెగ చంకలు గుద్దేసుకుంది.. పాప. దానికి మన పులిహోర రాజా.. ‘ఇది ఎవరూ ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు.. నువ్ తినే కోడి కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండదు..’ అంటూ కుళ్లుజోక్‌లు వేశాడు. మా డాడీ నాకు ఏదైనా కొనిపెడతా అంటే.. వద్దు డాడీ.. నాకు చికెన్ తీసుకుని రా చాలు అని అంటానంటూ.. తన తిండిగోళని అలానే కంటిన్యూ చేసింది శ్రీ సత్య.