బిగ్ బాస్ చూస్తున్న వాళ్లకు షాకుల మీద షాకుల తగులుతున్నాయి! మొన్నటికి మొన్న ఈ సీజన్ లోనే టాప్ కంటెస్టెంట్ అనుకున్న గీతూ ఎలిమినేట్ అయిపోవడంతో అందరూ షాకయ్యారు. ఇంకా దాని నుంచి తేరుకోవడం లేదు. ఇక మిగతా కంటెస్టెంట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ఫస్ట్ ప్రస్తావన వచ్చే పేరు సింగర్ రేవంత్. అన్ని విషయాల్లో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే మనోడు.. కొన్నిసార్లు మాత్రం బరస్ట్ అయిపోతున్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. దీంతో బిగ్ బాస్ షోపై డిసప్పాయింట్ మెంట్ వ్యక్తం చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీ కోసం పాము-నిచ్చెన టాస్క్ పెట్టారు. ఇందులో శ్రీసత్య, వాసంతి, రోహిత్, ఇనయా ఔటయ్యారు. వీళ్లకు మరో ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్.. రేవంత్ ని సంచాలక్ గా నియమించి, స్టిక్కరింగ్ గేమ్ ఆడించాడు. దీంతో ఫస్ట్ ఇనయా, వాసంతి.. ఆడకుండానే బయటకొచ్చేశారు. ఇక దీని తర్వాత నాగమణుల టాస్క్ స్టార్ట్ అయింది. పాములు, నిచ్చెనలు టీమ్ లో సభ్యులు.. మణులు సంపాదించేందుకు గట్టిగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పాము టీమ్ లోని సభ్యులు.. రేవంత్ ని రెచ్చగొడదాం అని ముందే ఫిక్సయ్యారు. ఫైమా చెప్పిన మణులు కొట్టేసే ఈ ప్లాన్ కి.. మిగతా సభ్యులు ఓకే చెప్పారు.
అనుకున్నట్లుగానే పాము టీమ్ సభ్యులు, రేవంత్ వీక్ పాయింట్ మీద కొట్టారు. ఫిజికల్ కాకుండానే అవుతున్నాడని గట్టిగా అరిచారు. ఆదిరెడ్డి గొడవపడే సరికి రేవంత్ రెచ్చిపోయి వాదనకు దిగాడు. ఇక కీర్తి కూడా రేవంత్ తన కంట్లో చేయి పెట్టాలని రచ్చ చేసింది. ఇక ఆదిరెడ్డి కూడా రేవంత్ తో ఫిజికల్ అయ్యావు అని అంటూ మాటమాట పెరిగేలా చేశాడు. ఇలా పక్కా ప్లాన్ తో రేవంత్ ని మానసికంగా దెబ్బకొట్టారు. ఫలితంగా నిచ్చెనల టీమ్, టాస్కులో ఓడిపోయింది. ఇదంతా జరిగిన తర్వాత గార్డెన్ ఏరియాలో కూర్చున్న రేవంత్.. అనవసరంగా బిగ్ బాస్ కి వచ్చానని తెగ బాధపడ్డాడు. అందరూ తన వీక్ నెస్ తో ఆడుకుంటున్నారని, దీంతో తన కాళ్లు, చేతులు కట్టేసినట్లు అయిపోయిందని అన్నాడు. బిగ్ బాస్ హౌసులోకి రాకుండా ఉండాల్సిందని కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించాడు. గతంలోనూ గీతూతో గొడవజరిగినప్పుడు రేవంత్ ఇలానే బాధపడ్డాడు. అయితే రేవంత్ బాధలో అర్థముందని, మిగతా సభ్యులు కావాలనే అతడికి రెచ్చగొడుతున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.