బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మరికొన్ని గంటల్లోనే బుల్లితెర రియాలిటీ ప్రారంభం కానుంది. ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్న ఇంటి సభ్యులు.. హౌస్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అయిపోతున్నారు. మునుపెన్నడూ లేని రేంజ్‌లో ఎంటర్‌టైన్మెంట్ ఇస్తామంటూ నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈసారి పాల్గొనపోయేవారి పేర్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అందరూ కాస్తో కూస్తో ఫాలోయింగ్ ఉన్న వాళ్లే కావడంతో ఈసారి షో కచ్చితంగా రసవత్తరంగా మారబోతోందనే చెప్పాలి. అయితే ఈసారి రూల్స్ కూడా మారబోతున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా టాస్కులు కూడా టఫ్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది.
ఈసారి హౌస్‌లో అడుగుపెట్టబోయే వారిలో సింగర్ రేవంత్ పేరు బాగా వినిపించింది. మనోడు కచ్చితంగా టైటిల్ ఫేవరెట్ అని అందరికీ తెలిసిందే. అయితే స్టేజ్ అడుగుపెట్టేదాకా వాళ్లు ఉంటారా? లేదా? అనేది ఎవరికీ తెలియని విషయం. కానీ, సింగర్ రేవంత్ మాత్రం కచ్చితంగా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లబోతున్నాడు అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఎందుకంటే ఆ విషయాన్ని రేవంత్ స్వయానా తన ఇన్ స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశాడు కాబట్టి. తాను హౌస్‌లోకి వెళ్లబోతున్నానని అందరి సపోర్ట్ తనకి కావాలంటూ విజ్ఞప్తి చేశాడు. కచ్చితంగా టైటిల్‌తోనే తిరిగొస్తానంటూ చెప్పుకొచ్చాడు.
“జీవితంలో కొన్నింటిని వదులుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నా కుటుంబాన్ని మిస్ అవుతున్నాను, ముఖ్యంగా నా భార్యను మిస్ అవుతున్నాను, ప్రత్యేకంగా మ్యూజిక్‌ని మిస్ అవుతున్నాను. కానీ, ఒక భగీరథుడు సాధనలా గెలిచి మంచి పేరుతో బయటకు వస్తాను. ఓటింగ్స్ రూపంలో నాకు మీ ప్రేమాభిమానాలు కావాలి. నా వైపు నుంచి వందశాతం ఎంటర్‌టైన్ చేస్తాను. మీ అందరి దీవెనలతో నేను టైటిల్ తో తిరిగొస్తాను..” అంటూ రేవంత్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో స్టోరీ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అది కాస్తా వైరల్ గా మారింది. గతంలో అయితే ఇంట్లోకి వెళ్లే సభ్యులు హింట్ ఇచ్చారు గానీ, మరీ ఇంత డైరెక్ట్ గా ఎవరూ చెప్పలేదు.
నిజానికి క్వారంటైన్‌లో ఉన్నప్పుడు గతంలో అయితే వారి నుంచి ఫోన్లు తీసుకునే వారు. కానీ, ఈసారి మాత్రం ఫోన్లు వాడటమే కాదు.. ఇన్ స్టాగ్రామ్ లైవ్‌లు, పోస్టులు, స్టోరీలు కూడా పెట్టేస్తున్నారు. అయితే ఇదంతా బిగ్ బాస్ హౌస్ వాళ్లు ఆ అవకాశం ఇచ్చారా? లేక బిగ్ బాస్ నిర్వాహకుల అనుమతితోనే ఇలా పెడుతున్నారా? అనే విషయంపై క్లారిటీ లేదు. సింగర్ రేవంత్ మాత్రం బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. రేవంత్ స్టోరీ చూసిన అతని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. తమ ఫేవరెట్ సింగర్ ని బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తామంటూ హామీ ఇస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లోకి సింగర్ రేవంత్ వెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
వీడియో: అసలు బెండపూడి పాఠశాలలో ఏం జరుగుతోంది?: