బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. హౌస్ మొత్తం ఎమోషనల్ గా ఉంది. హౌస్‌మేట్స్ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు ప్రేక్షకులు కూడా బాగా ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పటికే దాదాపుగా అందరూ హౌస్‌లోకి వచ్చేశారు. వారిలో ఆదిరెడ్డి, ఇనయా సుల్తానా, శ్రీహాన్, కీర్తీ భట్ వాళ్లకు సంబంధించిన వాళ్లు వచ్చినప్పుడు బాగా ఎమోషనల్ అయ్యారు. అయితే సింగర్ రేవంత్ కోసం ఎవరు వస్తారా? అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఎందుకంటే అతని భార్య గర్భవతి కాబట్టి ఇంకా ఎవరు వస్తారా అని చూశారు. అయితే రేవంత్ కు బిగ్ బాస్ మంచి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు. అందుకేనేమో ఆఖరి వరకు రేవంత్ ఇంటి సభ్యులను తీసుకురాలేదు.
అలాగే అందరూ అనుకున్నట్లుగా రేవంత్ వాళ్ల భార్య హౌస్‌లోకి రాలేదు. కానీ, వీడియో కాల్ చేశారు. అయితే రేవంత్‌ని ఎమోషనల్ అవ్వద్దు అంటూ సూచిస్తుంది. హ్యాపీగా ఉండచ్చు కదా.. అంటూ కోరుతుంది. అయితే వీడియో మధ్యలో ఆపేస్తారు. రేవంత్ బాగా ఎమోషనల్ అయిపోయాడు. బిగ్ బాస్ నా భార్యతో మాట్లాడతాను బిగ్ బాస్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే కాసేపటికి బిగ్ బాస్ రేవంత్‌కి మళ్లీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. హౌస్‌లోకి వాళ్ల అమ్మను పంపాడు. రేవంత్ అమ్మని చూడగానే హౌస్‌మేట్స్ అంతా రేవంత్ అంటూ కేకలు వేశారు. ఒక్కసారిగా రేవంత్ ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మను చూసి రేవంత్ బాగా ఎమోషనల్ అయ్యాడు. తల్లిని గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు.
ఇట్లోని సభ్యులు అందరినీ రేవంత్ తల్లి పలకరించారు. శ్రీహాన్‌ని చూసి.. నీలాంటి మిత్రుడు దొరకడం రేవంత్ అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది. అలాగే రేవంత్‌ని ఆ గడ్డం చూసి.. కొంచ ఆ గడ్డం తీయచ్చు కదా అంటూ అడుగుతుంది. అందుకు రేవంత్ ఇప్పుడు తీయచ్చా అని అడుగుతాడు. కనుక్కున్నాను తీయచ్చు అని చెప్పగానే.. ఇప్పుడే వస్తాను అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. రేవంత్ వెంటనే గడ్డం తీసేసి మీసం మెలేస్తూ వస్తాడు. కొడుకుని చూసుకుని ఆ తల్లి మురిసిపోతుంది. ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో అంటూ చెప్తుంది. రేవంత్‌కి తల్లి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పనితో తల్లి మీద ప్రేమని మరోసారి నిరూపించు కున్నాడు.