‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ మొదటిరోజు నుంచే ఉత్సాహంగా సాగుతోంది. టాస్కులు, ట్రిక్కులతో బిగ్ బాస్ ఇంట్లోని సభ్యులను ముప్పుతిప్పలు పెట్టేందుకు ముందు నుంచే రెడీ అయిపోయాడు. క్లాస్, మాస్, ట్రాష్ అంటూ కొత్త టాస్కుతో కథను రక్తి కట్టించాడు. ఈ టాస్కులో ట్రాష్ ఉన్న సభ్యులు నేరుగా నామినేట్ అయిపోతారు. క్లాస్ కేటగిరీలో ఉన్న సభ్యులు నామినేట్ కాకుండా సేవ్ అవుతారు. అంతేకాకుండా క్లాస్ సభ్యులకు వీఐపీ బాల్కనీ సదుపాయాలను వాడుకునే వెసులుబాటు కూడా ఉంది. ట్రాష్ సభ్యులు వారి పనులు చేసుకోవడమే కాకుండా ఇంట్లో ఎవరు ఏ పని చెప్పినా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారి వంట కూడా బయట లాన్ చేసుకోవాలి.
అయితే మొదటరోజు ఆట నడిచినంత వరకు ట్రాష్‌లో ఇనయా సుల్తానా, గీతూ రాయల్, సింగర్ రేవంత్ ఉన్నారు. ఈ టాస్కులో ట్రాష్ సభ్యులు తమని స్టార్‌గా అనుకునే వాళ్ల గురించి చెప్పాలంటూ ఒక టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇనయా సుల్తానా అందరినీ ఏడిపించేసింది. తన తండ్రి డ్రీమ్‌ను తాను ఫుల్‌ఫిల్ చేయడానికి వచ్చినట్లు తెలిపింది. రేండేళ్ల క్రితం తండ్రి చనిపోయారు అనగానే కీర్తీ భట్ ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత సింగర్ రేవంత్ కూడా తన జీవితంలోని కొన్ని విషయాలను ఇంట్లోని సభ్యులు, ప్రేక్షకులతో పంచుకున్నాడు. తాను అసలు సింగర్ ఎలా అయ్యాడు? అందుకు ఎవరు సపోర్ట్ చేశారు. ఇలా అన్ని విషయాలు పంచుకున్నాడు.
“నా తండ్రి మా చిన్నప్పుడే చనిపోయారు. కానీ, మాకు ఆరో తరగతి వరకు ఆ విషయం తెలియదు. నాన్న అమెరికాలో ఉన్నాడు. వచ్చేస్తాడంటూ చెప్పుకుంటూ వచ్చేవాళ్లు. నేను అప్పట్లో అమెరికా ఒక్కసారైనా వెళ్లాలి. అలా వెళ్తే నాన్నని కలుసుకోవచ్చు అనుకునేవాడిని. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. నా లైఫ్‌లో ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చాను. క్యాటరింగ్ బాయ్ గా చేశాను, పేపర్లు ఏశాను, అంట్లు తోమాను, ఫ్రెండ్స్ బట్టలు ఐరన్ చేశాను. సింగర్‌గా 16వ ఏట నా తొలి సంపాదన రూ.50. ఏదో స్టేజ్ మీద పాడితే ఇచ్చారు. ఇప్పుడు లైఫ్‌లో బాగా సెటిల్ అయ్యాను. వైఫ్, ఫ్యామిలీ అంతా సూపర్‌గా ఉంది. కాకపోతే ఇదంతా జరగాలి అంటే పేరెంట్స్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే అవుతుంది” అంటూ సింగర్ రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. రేవంత్ ఎమోషనల్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.