బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అంగరంగ వైభవంగా బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభం అయిపోయింది. హోస్ట్ నాగార్జున అదే జోష్ తో షోని నడిపిస్తున్నారు. స్పెషల్ సాంగ్స్, ఎలివేషన్స్ తో స్టేజ్ అంతా పండగలా మారిపోయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మూడో కంటెస్టెంట్‌గా శ్రీహాన్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. నిజానికి ఇప్పుడున్న లిస్ట్ ప్రకారం శ్రీహాన్ కచ్చితంగా టైటిల్ ఫేవరెట్ అనే చెప్పొచ్చు. ఇక్కడ శ్రీహాన్ కు మరింత కలిసొచ్చే అంశం ఏంటంటే.. అతని ప్రియురాలు సిరికి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఫేమ్‌లో, ఫాలోయింగ్‌లో శ్రీహాన్ కంటే ఒకడుగు ముందే ఉంది కాబట్టి డబుల్ ధమాకా వర్కౌ ట్ అయ్యిదనే చెబుతున్నారు.
అయితే అసలు శ్రీహాన్ ఎవరో తెలియని వారికోసం.. అతని గురించి కొన్ని వివరాలు ఈ ఆర్టికల్‌లో మీకోసం తెలియజేస్తున్నాం. వైజాగ్‌కు చెందిన శ్రీహాన్ కు సినిమా అంటే పిచ్చి. ఎప్పటికైనా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనే కోరికతో హైదరాబాద్ వచ్చేశాడు. షాట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో తనలో మంచి నటుడు ఉన్నాడంటూ ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి సిరి హన్మంత్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడం, వాళ్లిద్దరూ లివిన్‌లోనూ ఉంటోందని చాలా మందికి తెలుసు. లాస్ట్ సీజన్లో సిరి హన్మంత్ బిగ్ బాస్‌కి వెళ్లగా శ్రీహాన్ ఎంతగానో సపోర్ట్ చేశాడు. ఇప్పుడు సిరి సైతం అతనికి అలాంటే సపోర్ట్ ఇస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. శ్రీహాన్ బయోడేటా ఏంటో చూద్దాం.