ఆర్జే సూర్యా.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు మాత్రమే కాదు బయటకు వచ్చిన తర్వాత కూడా బాగా వైరల్ అవుతున్నాడు. హౌస్‌లో ఉన్నప్పుడు చేసిన పనుల గురించి బయటకు వచ్చిన తర్వాత అంతా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అతను టాప్ 5 కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టాడు. అయితే నిజానికి అలాంటి ప్రదర్శనే చేశాడు. ఫిజికల్ టాస్కులు, ఎంటర్‌టైన్మెంట్, కుకింగ్, డాన్సు ఇలా అన్ని విషయాల్లో ఇంట్లో ఉన్న చాలా మందికంటే సూర్యా తోపనె చెప్పాలి. హౌస్‌లో ఉన్న అన్ని రోజులు అజతా శత్రువుగా పేరు పొందాడు. అయితే దానిని నాటకం అని కూడా చెప్పుకొచ్చారు. అంటే అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసమే అతను అలా బిహేవ్ చేశాడంటూ హౌస్‌లో వాళ్లే చాలా మంది ఆరోపణలు చేశారు.
ఇంకో ప్రధాన ఆరోపణ ఏంటి అంటే.. ఫెమినిస్ట్ అని చెప్పుకుంటూ అందరితో ఎఫైర్లు నడిపాడంటూ కామెంట్ చేస్తున్నారు. మొదట ఆరోహితో క్లోజ్ ఉన్న విషయం తెలిసిందే. సగం సూర్య వల్లే ఆరోహి ఎలిమినేట్ అయ్యిందనే వ్యాఖ్యలు కూడా వచ్చాయి. అప్పట్లో మనోడిని సురోహి అని కూడా పిలిచారు. ఆరోహి అలా గేటు దాటగానే.. ఇనయాతో మనోడు దుకాణం మొదలు పెట్టాడు. ఇనయూ సుల్తానా కూడా లేస్తే సూర్యా చుట్టూనే తిరగుతూ ఉంది. సూర్య జపం చేస్తో.. అవకాశం దొరికినా దొరకకపోయినా ఇద్దరూ కౌగింలించుకోవడం చేస్తూ హౌస్ మొత్తంలో గబ్బులేపడం చూశాం. ఆ తర్వాత సునయా అని కూడా పేరు వచ్చింది. మధ్యలో కీర్తీ భట్‌తోనూ మనోడు క్లోజ్‌గా ఉన్నాడు. సూర్యా ఎలిమినేట్ అయిన సమయంలో అయితే ఇనయా ఏడ్చి గగ్గోలుపెట్టింది. కీర్తీ కూడా అలాగే ఏడ్చింది.
బయటకు వచ్చిన తర్వాత బీబీ కెఫేలో ఆర్జే సూర్యను యాంకర్ శివ ఒక ఆటాడుకున్నాడు. ఈ అన్ని అంశాలను ప్రస్తావిస్తూ ప్రశ్నల వర్షం కురిపించాడు. మొదట అసలు ఫెమినిస్ట్ అంటే ఏంటని ప్రశ్నించాడు. అందుకు సూర్య ఆడవాళ్ల ఆలోచలను వ్యాల్యూ ఇస్తూ.. వాటిని అర్థం చేసుకునే వారిని ఫెమినిస్ట్ అంటారంటూ చెప్పుకొచ్చాడు. మరి నువ్వు అలా ఎందుకు లేవంటూ మళ్లీ ప్రశ్నించాడు. తాను ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదని సూర్య సమర్థించుకున్నాడు. తాను బయట ఎలా ఉన్నాడో లోపల కూడా అలాగే ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. ఆరోహి విషయానికి వస్తే.. తాము చాలా ఏళ్లుగా ఫ్రెండ్స్ ఎక్కడా బోర్డర్ దాటలేదని చెప్పాడు. ఇంక ఇనయా విషయానికి వస్తే.. తనకు ఇంట్రస్ట్ ఉంది గానీ.. తాను మాత్రం ఫ్రెండ్ జోన్‌లోనే ఉంచానన్నాడు.
మరి.. హగ్గులు- ముద్దుల విషయంపై కూడా యాంకర్ శివ ప్రశ్నించాడు. నేను ఎక్కడా తప్పుగా చేయలేదు.. మీరే అలా అనుకున్నారేమో అనేశాడు. అందుకు అంటే మీరు చేసిన దాంట్లో తప్పులేదు.. మేం చూడటమే తప్పు అంటారా? అని కొన్ని మీమ్స్ ని కూడా చూపించాడు. అందులో ఆర్జే సూర్య హగ్గులు ఉన్నాయి. శివ కౌంట్ర్ వేయబోతే నేను ఫైమాతో కూడా క్లోజ్‌గా ఉన్నాను.. మరి అది ఎందుకు రాలేదు తప్పుగా అన్నాడు. ఆ తర్వాతి ఫొటోలో ఫైమా కూడా ఉంది. అలా బయట మనోడి గురించి ఏ స్థాయిలో ప్రచారం ఉందో చూపించాడు. అయితే అటు కీర్తీతో కూడా నడిపావుగా అనగానే నేను తప్పుగా ఏం చేయలేదంటాడు. ముద్దు గురించి అడగ్గా.. నేను ఒక తండ్రిగా మాత్రమే అక్కడ ముద్దు పెట్టానని.. రొమాంటిక్‌గా అయితే ఎక్కడ పెడతారనే విషయం మీకు తెలియదా అంటూ చెప్పుకొచ్చాడు.