బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. కాస్త ఆసక్తిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్‌లో మళ్లీ నాగార్జున క్లాసులు పీకడం ప్రారంభించాడు. ముందుగా సింగర్ రేవంత్‌కు హోస్ట్ నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. సంచాలక్‌గా నీకు ఇచ్చిన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించావా అంటూ సూటిగా ప్రశ్నించాడు. అయితే రేవంత్ సంచాలక్‌గా ఎలా ఆడాడు అంటూ ఇంట్లోని సభ్యులను అడగ్గా… ఆదిరెడ్డి బాగుందన్నాడు. అందుకు నాగ్ నీకు ఫేవరబుల్‌గా ఉంది కాబట్టి బాగుందంటున్నావ్. రోహిత్‌కి ఫేవర్‌బుల్‌గా డెసిషన్ రాలేదు కాబట్టి బాలేదంటున్నాడు. రేవంత్ ఎప్పుడైనా బిగ్ బాస్ రూల్స్‌కి విరుద్ధంగా నువ్వు కొత్త రూల్స్ పెట్టకు అంటూ వార్న్ చేశాడు.
ఇంక హౌస్‌లో ప్రస్తుతం కాస్త ఇంట్రస్టింగ్‌గా ఉన్నది ఇనయా- ఫైమా మధ్య జరుగుతున్న యుద్ధం. ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్న వీళ్లు ఇప్పుడు శత్రువుల్లా మారి కొట్టేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో కూడా ఫైమాని ఇనయా సుల్తానా ఎత్తి ఎత్తి పడేసింది. ఫైమా నేరుగా వచ్చిన ఇనయా సుల్తానాని టార్గెట్ చేయడం.. ఇనయా సుల్తానా ఫైమాతో ఇష్టమొచ్చినట్లు ఫిజకల్ అవ్వడం చూసి ఇంట్లోని సభ్యులు కూడా నోరెళ్లబెట్టారు. ఎంత చెప్పినా కూడా ఫైమా- ఇనయా కొట్టుకోకుండా ఆపలేకపోయారు. అంతకంటే ముందు నామినే,న్స్ సమయంలో కూడా వారి మధ్య ఒక గొడవ జరిగింది. అప్పుడు ఇనయా సుల్తానా నోటికొచ్చినట్లు మాట్లాడటం చూశాం.
ఇనయా సుల్తానా- ఫైమా వార్ మీద హోస్ట్ నాగార్జున స్పందించాడు. అందరూ అనుకున్నట్లే ఇనయాకి గట్టిగానే క్లాస్ పీకాడు. ఫైమాతో జరిగిన గొడవలో మరీ పర్సనల్ అవుతున్నావంటూ హెచ్చరించాడు. “ఇనయా కోపంలో ఏది పడితే అది మాట్లాడేస్తావా? కోపంలో F వర్డ్స్ కూడా మాట్లాడతావా? నామినేషన్స్ లో నువ్వు ఫైమాని అన్న మాటలు బాగా పర్సనల్ గా అనిపించాయి. నువ్వు ఆమె ప్రొఫెషన్‌ని డీగ్రేడ్ చేశావ్. ఫైమా అంతా అడల్ట్ కామెడీ చేస్తుందని కామెంట్ చేశావు. మరి.. ఫైమా అడల్ట్ కామెడీ స్టార్ అయితే.. నువ్వు ఏంటి? నిన్ను ఏమనాలి?” అంటూ నాగార్జున సూటిగా ప్రశ్నించాడు. అందుకు ఇనయా ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. ఇనయాపై నాగార్జున ఫైర్ అవ్వడాన్ని ప్రేక్షకులు సైతం సమర్థిస్తున్నారు. ఈ సీజన్‌లో ఈ ఎపిసోడ్‌లో బెస్ట్ పర్ఫార్మ్ చేశారంటూ మెచ్చుకుంటున్నారు.