‘బిగ్ బాస్’లో వారమంతా ఎలా ఉన్నా సరే.. వీకెండ్ ఎపిసోడ్ వస్తే మాత్రం సందడి వేరే లెవల్. హోస్ట్ నాగార్జున వచ్చేస్తాడు. పార్టిసిపెంట్స్ లో ఎవరికీ ఇవ్వాల్సింది వాళ్లకు ఇచ్చేస్తాడు. ఒక్కొక్కరినీ నిలబెట్టి మరీ ఆడేసుకుంటాడు. ఆ విషయంలో ఏ మాత్రం మొహమాటపడడు. ప్రస్తుతం ఆరో సీజన్ తొలివారం వీకెండ్ ఎపిసోడ్ లో స్టైలిష్ గా కనిపించిన నాగ్.. హౌస్ లో ఉన్నవాళ్లకే కాదు బయటనుంచి ఈ షోపై విమర్శలు చేసిన ఓ వ్యక్తికి స్ట్రాంగ్ కౌంటర్స్ వేశారు. శనివారం ఎపిసోడ్ చూస్తే అది అనిపిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ అంటే తెలుగునాట ఎంత క్రేజ్ ఉందో, కాస్తోకూస్తో వ్యతిరేకత కూడా ఉంది. మొదటి నుంచి ఈ షోపై సీపీఐ పార్టీ నాయకుడు నారాయణ విమర్శలు చేస్తూనే ఉన్నారు. షోని బ్యాన్ చేయాలని కూడా గతంలో అన్నారు. ఇక తాజాగా ఆరో సీజన్ మొదలవగానే.. మరోసారి మండిపడ్డారు. కాసులకు కక్కుర్తి పడేవాళ్లు ఉన్నంతవరకు.. ఇలాంటి కార్యక్రమాల్ని అడ్డుకోలేమని అన్నారు. గత సీజన్లలో ఎప్పుడూ కూడా నారాయణ వ్యాఖ్యలపై స్పందించని నాగార్జున.. ఈసారి మాత్రం తొలి వారమే కౌంటర్స్ వేసేశారు.
ఈసారి రోహిత్-మెరీనా జంటగా పాల్గొన్నారు. వాళ్లిద్దరి మధ్య కొద్దిగా దూరం పెరిగినట్లు, ప్రేమ తగ్గినట్లు కనిపించింది. ఈ విషయాన్నే ప్రస్తావించిన నాగ్.. అందరి ముందే హగ్ చేసుకోమని చెప్పాడు. అలా రోహిత్-మెరీనా హగ్ చేసుకుంటున్న సమయంలో.. ‘వాళ్లిద్దరూ భార్యభర్తలు నారాయణ నారయణ’ అని ఫన్నీగా అన్నారు. ఇది చూసిన చాలామంది.. నాగ్ కావాలనే నారాయణపై భలే కౌంటర్స్ వేశారని మాట్లాడుకుంటున్నారు. ఈ విమర్శలు-కౌంటర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వాళ్ళు పతివ్రతలు ఎలా అవుతారు: CPI నారాయణ!